ETV Bharat / sports

Team India: టీమ్​ఇండియా vs సెలక్షన్ కమిటీ.. ఏంటి గొడవ?

టీమ్​ఇండియా మేనేజ్​మెంట్​కు, సెలక్షన్ కమిటీకి మధ్య సఖ్యత ఉన్నట్లు కనిపించడం లేదు. ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​ కోసం పృథ్వీషా, దేవ్​దత్ పడిక్కల్​ను తీసుకోవాలని సెలక్షన్ కమిటీకి సూచించిన.. సెలక్టర్ చేతన్ శర్మ పట్టించుకోవడం లేదట! ఇంతకీ ఏం జరుగుతోంది?

shah
షా, పడిక్కల్​
author img

By

Published : Jul 5, 2021, 5:43 PM IST

ఇంగ్లాండ్​తో ఐదు టెస్టుల​ సిరీస్​కు యువ బ్యాట్స్​మెన్ పృథ్వీ షా, దేవదత్​ పడిక్కల్​ను(Prithvi Shah, padikkal) తీసుకోకుండా, అభిమన్యు ఈశ్వరన్​ను ఎంపిక చేయడం చర్చనీయాంశమవుతోంది. టీమ్​ఇండియా మేనేజ్​మెంట్​ వారిని ఆడించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్​ చేతన్​ శర్మ ఆ అభ్యర్థనను పట్టించుకోలేదని తెలిసింది! గాయపడిన శుభ్‌మన్‌ గిల్‌ స్థానాన్ని ఈ ఇద్దరిలో ఒకరితో భర్తీ చేయాలన్నది జట్టు యాజమాన్యం ఉద్దేశమని తెలుస్తోంది.

"న్యూజిలాండ్​ ఫైనల్​లో శుభమన్​ గిల్​ గాయపడ్డాడు. దీంతో ఇంగ్లాండ్​తో టెస్టు​ సిరీస్​కు పూర్తిగా దూరమయ్యాడు. కోలుకోవడానికి దాదాపు మూడు నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో గతనెల చివర్లో ఇద్దరు ఓపెనర్లను యూకేకు పంపించాలని చేతన్ శర్మకు ఈమెయిల్​ ద్వారా వినతి పంపించారు. కానీ దానిని శర్మ పట్టించుకోలేదు. అయితే షా, పడిక్కల్​ను తీసుకోవాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ షాకు ఎటువంటి విజ్ఞప్తి రాలేదు. ప్రస్తుతం ఈ క్రికెటర్లు శ్రీలంక పర్యటనలో ఉన్నారు. జులై 26న ఆ పర్యటన పూర్తవగానే ఇంగ్లాండ్​ సిరీస్​కు బయలుదేరే అవకాశముంది. కానీ టీమ్​మేనేజ్​మెంట్​ వారిని మిగతా జట్టు బయోబుబుల్​లోకి ప్రవేశించకముందే యూకేకు రప్పించాలని ఆశిస్తోంది" అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు అన్నారు.

'షా'కు ప్రాముఖ్యత

"షా, ఈశ్వరన్​ను పోల్చలేం. వారిద్దరిలో పృథ్వీ చాలా ముందున్నాడు. ఇప్పటికే ఓ టెస్టు​ సెంచరీ కూడా చేశాడు. అతడు మంచి ఫామ్​లో ఉన్నాడు. కాబట్టి అతడు ఉండాల్సింది శ్రీలంకలో కాదు ఇంగ్లాండ్​లో. ఇప్పటికైనా షాను త్వరగా జట్టులోకి తీసుకోవాలి. కానీ ఇప్పుడు షాను ఎంపిక చేయడం వల్ల ఈశ్వరన్​ ఆత్మవిశ్వాసం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. పడిక్కల్​ను ఇప్పుడు పంపించకపోయినా నష్టమేమి లేదు. అన్ని ఫార్మాట్లలో తానేంటో నిరూపించుకోవడం అతడికి పెద్ద విషయం ఏమీ కాదు" అని మాజీ సెలక్టర్​ ఒకరు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: Team India: ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​కు పృథ్వీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.