Irfan Pathan Virat Kohli: కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ఇప్పటివరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన టెస్టు కెప్టెన్లలో కోహ్లీనే అత్యత్తమం అని పేర్కొన్నాడు. రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై టీమ్‌ఇండియా ఘన విజయం సాధించి 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ట్వీట్ చేశాడు.
"నేను ఇదివరకు చెప్పినట్టుగా విరాట్ కోహ్లీ టీమ్ఇండియాకు దక్కిన అత్యుత్తమ టెస్టు కెప్టెన్. గెలుపు శాతం 59.09తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండవ స్థానం 45 శాతంగా ఉంది."
-ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్
-
As I have said earlier and saying it again @imVkohli is the best Test Captain India have ever had! He's at the top with the win percentage of 59.09% and the second spot is at 45%.
— Irfan Pathan (@IrfanPathan) December 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">As I have said earlier and saying it again @imVkohli is the best Test Captain India have ever had! He's at the top with the win percentage of 59.09% and the second spot is at 45%.
— Irfan Pathan (@IrfanPathan) December 6, 2021As I have said earlier and saying it again @imVkohli is the best Test Captain India have ever had! He's at the top with the win percentage of 59.09% and the second spot is at 45%.
— Irfan Pathan (@IrfanPathan) December 6, 2021
కోహ్లీ రికార్డు..
న్యూజిలాండ్‌పై సిరీస్ విజయంతో కోహ్లీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించి ప్రతి ఫార్మాట్లో జట్టుకు 50 విజయాలు అందించిన తొలి ఆటగాడిగా ఘనత పొందాడు. దీనిపై బీసీసీఐ కోహ్లీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది.
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ మరో 27 పరుగులే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన గంటలోపే ఆ జట్టు 167 పరుగులకు కుప్పకూలింది.
సోమవారం ఉదయం జయంత్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్ చివరి వికెట్ తీశాడు. హెన్రీ నికోలస్ (44) పరుగులతో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది భారత్. కాగా, టెస్టుల్లో భారత్‌కు ఇది పరుగుల పరంగా అత్యంత భారీ విజయం.
ఇదీ చూడండి : డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే?