ఆరెంజ్ క్యాప్ కోసం కలలు కంటున్న తనకు కోహ్లీ గత సీజన్లో ఇచ్చిన సలహా గురించి చెప్పాడు రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్. దిల్లీతో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ విషయాన్ని పంచుకున్నాడు.
"గత సీజన్లో కోహ్లీతో మాట్లాడినప్పుడు నాకు అతడో విలువైన సలహా ఇచ్చాడు. ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసే నువ్వు.. ఆరెంజ్ క్యాప్ ఎలా అందుకుంటావ్? అది సాధ్యం కాదు. కాబట్టి దాని గురించి ఆలోచించడం మానేసి జట్టు కావాల్సిన పరుగులపై దృష్టి పెట్టమని నాకు చెప్పాడు. అప్పటి నుంచి నేను చేస్తున్న పరుగులు జట్టుకు ఉపయోగపడుతున్నాయా లేదా అనే విషయాన్నే చూస్తూన్నా" అని పరాగ్ చెప్పాడు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 11 బంతుల్లో 25 పరుగులు చేసిన పరాగ్.. కెప్టెన్ సంజూ శాంసన్‌కు తనవంతు సాయం చేశాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు.