డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్.. ఐపీఎల్ రెండో దశ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. జట్టుకు సమతూకాన్ని తెచ్చే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(hardik pandya ipl) అందుబాటులో లేకపోవడం ఆ జట్టును బాగా దెబ్బ తీసింది. అయితే హార్దిక్ ఇంకా బరిలో దిగకపోవడం ముంబయికి మాత్రమే కాదు టీమ్ఇండియాను కూడా కలవరపరిచే అంశమే. టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) ఎంతో దూరంలో లేని నేపథ్యంలో ఈ స్టార్ ఆల్‌రౌండర్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించడం ఎంతో ముఖ్యం.
2021 ఐపీఎల్ ఆరంభంలో శిక్షణలో గాయపడిన పాండ్య(hardik pandya ipl).. ఈ సీజన్లో తొలి అంచెలో ఆడిన 3 మ్యాచుల్లో బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్‌లోనూ పెద్దగా రాణించలేదు. ప్రపంచకప్‌నకు ఎంపికైన ఏ భారత ఆటగాడినీ 100 శాతం ఫిట్‌గా లేకుండా ఐపీఎల్లో ఆడించకూడదని ఫ్రాంచైజీలకు బీసీసీఐ సూచించిన నేపథ్యంలో పాండ్యను ముంబయి బరిలో దించట్లేదు.
మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు పాండ్య(hardik pandya ipl) సమీపంగా ఉన్నాడని ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ చెప్పాడు. ఇటీవల శ్రీలంక వన్డే సిరీస్‌లో 3 వికెట్లే తీసిన పాండ్య.. బ్యాట్‌తో 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఇవీ చదవండి: