టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup) కోసం ఎంపిక చేసిన భారత జట్టులో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు మాజీ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వగ్. అటు శ్రీలంక పర్యటనలో.. ఇటు ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న చాహల్‌ను(Chahal Selection) ఎంపిక చేయకపోవడానికి కారణమేంటని బీసీసీఐ సెలెక్టర్లను సూటిగా ప్రశ్నించాడు.
"ఐపీఎల్లో చాహల్ ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్పిన్ బౌలింగ్‌లో అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అలాంటి ప్రదర్శననే శ్రీలంకతో జరిగిన సిరీస్‌లోనూ రాణించాడు. టీ20 ఫార్మాట్లో ఎలా బౌలింగ్ చేయాలో అతడికి తెలుసు. ఇంతగా నైపుణ్యం ఉన్న బౌలర్‌ను టీ20 ప్రపంచకప్ కోసం సెలెక్టర్లు ఎందుకు ఎంపిక చేయలేదో నాకు అర్థం కావడం లేదు".
- వీరేంద్ర సెహ్వాగ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
యూఏఈ, ఓమన్ వేదికలుగా(ICC T20 World cup 2021 Venue) అక్టోబరు 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ మెగాటోర్నీ కోసం 15 మంది ఆటగాళ్లతో ఎంపిక చేసిన జట్టును ఇటీవలే ప్రకటించింది బీసీసీఐ. అందులో ఐదుగురు స్పిన్నర్లకు అవకాశం ఇచ్చింది. రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకోగా.. యుజ్వేంద్ర చాహల్‌ను స్క్వాడ్‌లోకి ఎంపిక చేయలేదు. అయితే టోర్నీ ప్రారంభానికి ముందుగా.. అంటే అక్టోబరు 10లోగా జట్టులో ఏమైనా మార్పులు ఉంటే చేసుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి.. Inzamam Heart Attack: పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌కు గుండెపోటు