IPL 2023 LSG VS RCB : ఐపీఎల్ సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మ్యాచ్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీయడాన్ని చూసిన మిగతా ప్లేయర్స్ వారిని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అమిత్ మిశ్రా కోహ్లీని శాంతపరచగా.. కేఎల్ రాహుల్ గంభీర్‌ను పక్కకు తీసుకెళ్లాడు.
అయితే గత నెల 10వ తేదీన బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓడించినపుడు స్టేడియంలో బెంగళూరు అభిమానుల వైపు చూస్తూ లఖ్‌నవూ మెంటార్ గంభీర్.. నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా సంజ్ఞ చేశాడు. దాన్ని మనసులో పెట్టుకున్న కోహ్లి.. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు గెలుపు బాటలో సాగుతున్నపుడు రెచ్చిపోయాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతే కాకుండా గత మ్యాచ్‌లోనూ గంభీర్ చేసిన తీరులోనే విరాట్ కోహ్లీ కూడా ఆయూష్ బదోని క్యాచ్ అందుకోగానే గంభీర్‌లానే ష్.. గప్‌చుప్ అంటూ ప్రేక్షకులకు సూచించాడు.
-
Delhi boys pic.twitter.com/XOuM609RtS
— JAG19 (@GJA194) May 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Delhi boys pic.twitter.com/XOuM609RtS
— JAG19 (@GJA194) May 1, 2023Delhi boys pic.twitter.com/XOuM609RtS
— JAG19 (@GJA194) May 1, 2023
Virat Gambhir Controversy : మ్యాచ్ జరుగుతున్నంత సేపు విరాట్ కోహ్లీ చాలా దూకుడుగానే కనిపించాడు. లఖ్‌నవూ జట్టు వికెట్ కోల్పోయినప్పుడల్లా కూడా సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్ గెలిచిన ఆనందంలో మైదానంలోనే గట్టిగా అరిచాడు. కోహ్లీ చేస్తున్న చర్యలతో ఆగ్రహానికి గురైన గంభీర్.. అతన్ని ఏదో అనగా విరాట్ దానికి ధీటుగా బదులిచ్చాడు. ఇక విరాట్ కోహ్లీని శాంతపరిచేందుకు కేఎల్ రాహుల్ చాలా మేరకు ప్రయత్నించాడు. పక్కకు తీసుకెళ్లి కాసేపు మాట్లాడాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ తర్వాత కూడా ఈ ఇద్దరూ ఆటగాళ్లు వాగ్వాదానికి దిగారు. కోహ్లీతో మాట్లాడుతున్న కైల్ మేయర్స్‌ను గంభీర్ పక్కకు తీసుకెళ్లగా.. విరాట్ మండిపడ్డాడు. గతంలోనే వీరిద్దరూ వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. 2013లో కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న గంభీర్‌తో కోహ్లీకి మధ్య తొలిసారిగా వాగ్వాదం జరిగింది.
ఆ ఇద్దరికి పెద్ద షాక్!
Virat Vs Gambhir IPL : ఇక మ్యాచ్‌లో వాగ్వాదానికి దిగి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌తో పాటు ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీపై జరిమాన విధించింది ఐపీఎల్ యాజమాన్యం. ఈ మేరకు ట్వీట్ చేసిన ఐపీఎల్.. వారి మ్యాచ్ ఫీజులో 100% జరిమానా విధించింది. లఖ్‌నవూ ప్లేయర్ నవీన్ ఉల్ హక్‌పై కూడా 50 శాతం ఫైన్ విధించారు.
-
In IPL 2013. In IPL 2023. pic.twitter.com/VwRegv82GG
— CricketMAN2 (@ImTanujSingh) May 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">In IPL 2013. In IPL 2023. pic.twitter.com/VwRegv82GG
— CricketMAN2 (@ImTanujSingh) May 1, 2023In IPL 2013. In IPL 2023. pic.twitter.com/VwRegv82GG
— CricketMAN2 (@ImTanujSingh) May 1, 2023
గొడవకు కారణం అతనే !
ఎంతో ఉత్కంఠంగా జరిగిన వాగ్వాదానికి ఆజ్యం పోసినట్టు వ్యవహరించాడు లఖ్‌నవూ ప్లేయర్ నవీన్ ఉల్ హక్. ఛేజింగ్‌లో 76/8 స్కోర్ సమయంలో లఖ్‌నవూ జట్టు నుంచి వచ్చిన అతనికి.. మ్యాచ్ ఆరంభం నుంచే ఆవేశంగా కనిపించిన కోహ్లీకి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు పరస్పరం తిట్టుకోవడం వల్ల ప్రారంభమైన వాగ్వాదం.. ఆఖరికి పెద్దదయ్యింది. దీంతో చివరకు ఎంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఈ క్రమంలో బ్యాటింగ్ మరో ఎండ్‌లో ఉన్న లఖ్‌నవూ ప్లేయర్ అమిత్ మిశ్రా.. కోహ్లీతో చాలా సేపు మాట్లాడాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కోహ్లీ-నవీన్ మధ్య వాగ్వాదం కొనసాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలోనూ మళ్లీ ఘర్షణ జరిగింది. మ్యాక్స్‌వెల్ సహా ఇతర ఆటగాళ్లు వీరిద్దరకి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గంభీర్, మిశ్రాలతో కూడా కోహ్లీ సీరియస్‌గా మాట్లాడాడు. ఇరు జట్ల ఆటగాళ్లు కలగజేసుకుని వాగ్వాదాన్ని ఆపాల్సి వచ్చింది.
-
Kyle Mayers with Virat Kohli and Gautam Gambhir came took away from Kohli. pic.twitter.com/Cz6GhzyBd4
— CricketMAN2 (@ImTanujSingh) May 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kyle Mayers with Virat Kohli and Gautam Gambhir came took away from Kohli. pic.twitter.com/Cz6GhzyBd4
— CricketMAN2 (@ImTanujSingh) May 1, 2023Kyle Mayers with Virat Kohli and Gautam Gambhir came took away from Kohli. pic.twitter.com/Cz6GhzyBd4
— CricketMAN2 (@ImTanujSingh) May 1, 2023
ఇన్‌స్టా పోస్ట్ పెట్టిన కోహ్లీ !
వాగ్వాదం తర్వాత ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు విరాట్ కోహ్లీ. అందులో రోమన్ చక్రవర్తి మార్కస్ ఆరేలియస్ ఆంటోనినస్ చెప్పిన కోట్‌ను జత చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆ పోస్ట్‌ను అప్లోడ్ చేసిన కోహ్లీ.. "మనం విన్నవన్నీ ఒక అభిప్రాయం, వాస్తవం కాదు. మనం చూసేదంతా ఒక దృక్కోణం, నిజం కాదు" అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు గంభీర్‌తో జరిగిన వాగ్వాదం గురించే పెట్టాడని అభిమానులు భావిస్తున్నారు.