మానసిక ప్రశాంతతకైనా, శారీరక విశ్రాంతికైనా నిద్ర అనేది చాలా అవసరమని టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ అన్నాడు. ముఖ్యంగా అథ్లెట్లకు, వారి ప్రొఫెషనల్ కెరీర్ సాఫీగా సాగడానికి సరిపడ నిద్ర ఉండాలని పేర్కొన్నాడు. నిద్ర విషయంలో తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పిన అతడు.. డీప్ స్లీప్ అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్.. నిద్ర, ఫిట్‌నెస్‌తో పాటు తన క్రికెట్ కేరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాల గురించి మాట్లాడాడు.
"ఫ్రొఫెషనల్ కేరీర్ లేదా ప్రియమైనవారితోనైనా ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలంటే సరిపడా నిద్ర చాలా అవసరం. ఓ సారి కోల్‌కతాలో మూడు రోజుల పాటు మ్యాచ్ ఆడేందుకు వెళ్లాను. అయితే మ్యాచ్ ముందు రోజు రాత్రంతా పడుకోలేదు. పొద్దున 6.30 అయింది. ఆ తర్వాత 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. కేవలం 20 నిమిషాలే నిద్రపోయిన నేను.. బ్యాటింగ్‌కు వెళ్లి లంచ్ తర్వాత మళ్లీ పడుకున్నాను. కంట్రోల్ చేసుకోలేకపోయాను. అప్పుడు నిద్ర విలువ తెలిసింది. ఆ తర్వాత నుంచి ఫిట్‌నెస్‌కు, నిద్రకు చాలా ప్రాముఖ్యతనిస్తున్నాను. ప్రశాంతమైన ఆరోగ్యం కోసం మెడిటేషన్ చేస్తాను. మ్యూజిక్ వింటాను. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇలాంటి వాటిని జీవితంలో భాగంగా చేసుకున్నాను. రాత్రి 9.35 నుంచి 9.45 మధ్యలో నిద్రపోతాను. సరిపడ నిద్ర వల్ల మరింత బెటర్‌గా పెరఫార్మెన్స్ ఇవ్వగలను" అని విరాట్ చెప్పుకొచ్చాడు.
kohli bowling.. ఇకపోతే ప్రస్తుతం కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. రీసెంట్గా ఆర్సీబీ.. రాయల్ ఛాలెంజర్స్‌తో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తాను బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ రాయల్స్ 40 పరుగులకే ఆలౌట్ అయ్యేదని రీసెంట్గా కోహ్లీ సరదాగా అన్నాడు. 172 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌ను కేవలం 59 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో సరదాగా గడిపింది. ఆ వీడియోను ఈ జట్టు ఫ్రాంఛైజీ సోషల్‌మీడియాలో ట్వీట్ చేసింది. ఇందులో కోహ్లీ.. "నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ 40పరుగులకే ఆలౌట్ అయ్యేదేమో." అని విరాట్ అన్నాడు. కాగా, ఐపీఎల్‌లో కోహ్లీ మీడియం పేస్‌తో నాలుగు వికెట్లు పడగొట్టాడు. 2012లో జరిగిన ఓ మ్యాచ్‌లో సీఎస్కే ప్లేయర్ అల్బీ మోర్కెల్.. విరాట్ ఓవర్లో 28 పరుగులు బాదడంతో ఆర్సీబీ అనూహ్య ఓటమిని అందుకుంది. ఆ తర్వాత విరాట్ ఐపీఎల్‌లో ఎప్పుడూ బౌలింగ్‌కు దిగలేదు.
ఇదీ చూడండి: IPL 2023 GT VS SRH : మ్యాచ్ హైలైట్ స్టంట్స్ చూశారా?