సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారు. 151 పరుగుల లక్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో హైదరాబాద్‌ను 137 పరుగులకే కట్టడి చేశారు. 13 పరుగుల తేడాతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ముంబయి ఇండియన్స్‌లో తన సహచర బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతని బౌలింగ్ ప్రతిభకు కితాబిచ్చాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఒక బౌలర్‌గా ఏం చేయాలనుకుంటున్నాడో కచ్చితమైన ప్రణాళికతో దాన్ని అమలుపరిచే నైపుణ్యం బుమ్రా సొంతం అంటూ బౌల్ట్ వ్యాఖ్యానించాడు.
ఇదీ చదవండి: విలియమ్సన్‌ను ఎందుకు ఆడించట్లేదు?
"డెత్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్ వీరబాదుడుకు ఎలా ముక్కుతాడు వేయాలో బుమ్రాకు బాగా తెలుసు. బుమ్రా వంటి బౌలర్ల వల్ల మిగతా బౌలర్లకు కూడా పని సులభం అవుతుంది. ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టే అతని బౌలింగ్ వల్ల నా బౌలింగ్ కూడా ప్రశాంతంగా సాగిపోతుంది. టోర్నీలో మిగతా మ్యాచుల్లో మరింత బాగా రాణిస్తాం. హార్దిక్ ఫీల్డింగ్, రాహుల్ చాహర్ బౌలింగ్ కూడా సన్‌రైజర్స్‌పై విజయానికి కారణాలు. వాంఖడే, చెపాక్ మైదానాలు రెండూ భిన్నమైనవని.. రెండింటికి అనుగుణంగా ఆటతీరు ఉండాలి" అని బౌల్ట్ పేర్కొన్నాడు.
కాగా, సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లో బౌల్ట్ 3 వికెట్లు తీశాడు. చెన్నై వేదికగా ముంబయి ఇండియన్స్ జట్టు మంగళవారం దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
ఇదీ చదవండి: దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌కు స్టెంట్