ETV Bharat / sports

ఐపీఎల్​ను వీడేందుకు సిద్ధమైన వార్నర్​, స్మిత్​!

author img

By

Published : Apr 27, 2021, 11:43 AM IST

కరోనా కారణంగా ఐపీఎల్​ను వీడేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే ముగ్గురు ఆసీస్​ క్రికెటర్లు టోర్నీకి దూరంకాగా.. స్టార్​ ఆటగాళ్లైన డేవిడ్​ వార్నర్​, స్టీవ్​ స్మిత్​ ప్రస్తుత ఐపీఎల్​ నుంచి నిష్క్రమించనున్నారని ఆస్ట్రేలియా దేశ మీడియా సంస్థ ఓ నివేదికలో పేర్కొంది.

Top Aussie cricketers Warner, Smith could fly back: Report
ఐపీఎల్​ను వీడేందుకు సిద్ధమైన వార్నర్​, స్మిత్​!

కరోనా కారణంగా ఆస్ట్రేలియా అగ్రశ్రేణి క్రికెటర్లు ఐపీఎల్​కు దూరమవుతున్నారు. ఆ దేశ స్టార్​ ఆటగాళ్లు డేవిడ్​ వార్నర్​, స్టీవ్​ స్మిత్​ కూడా టోర్నీని వీడనున్నారని సమాచారం. ఓ ఆస్ట్రేలియా మీడియా సంస్థ నివేదిక మేరకు త్వరలోనే వీరిద్దరూ స్వదేశానికి పయనంకానున్నారని తెలుస్తోంది.

భారత్​ నుంచి వ‌చ్చే విమానాల‌పై ఆస్ట్రేలియా నిషేధం విధించే అవ‌కాశం ఉందన్న వార్త‌ల నేప‌థ్యంలో అంత‌కుముందే ఇంటికి వెళ్లిపోవాల‌ని వార్నర్​, స్మిత్​ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆర్సీబీ నుంచి ఆడ‌మ్ జంపా, కేన్ రిచ‌ర్డ్‌స‌న్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆటగాడు ఆండ్రూ టై తమ స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు.

ఐపీఎల్​లో డేవిడ్​ వార్నర్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్​గా వ్యవహరిస్తుండగా.. దిల్లీ క్యాపిటల్స్​లో స్టీవ్​ స్మిత్​ ఆడుతున్నాడు. అయితే భారత్​లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో తమ స్వదేశానికి వెళ్లేందుకు టోర్నీలో ఉన్న 30 మంది పేసర్లు, కోచ్​లు, కామెంటేటర్లు సిద్ధమైనట్లు ఆ నివేదిక పేర్కొంది.

ఇదీ చూడండి.. ఆటతోనే కాదు.. అందంలోనూ భేష్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.