ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, క్రునాల్ పాండ్య తమ జీవిత భాగస్వాములతో కలిసి సరదాగా ఓ వీడియో చేశారు. ఇందులో కూల్ డ్రెసింగ్‌తో హార్దిక్-నటాషా, కృనాల్-పంఖురీ సందడి చేశారు. ఆరెంజ్ కలర్ టీషర్టుల మీద స్మైలీ సింబల్స్, నల్లని షార్ట్స్ ధరించి చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ అలరించారు. ఈ వీడియోను హార్దిక్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. నటాషా కూడా 'ది పాండ్యాస్ స్వాగ్' అని రాసి ఓ ఫొటోను షేర్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కరోనా కారణంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలన్నీ బయో బబుల్‌లో ఉంటున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చదవండి: మ్యాక్సీకి బెంగళూరే సరైన జట్టు: వాన్
ముంబయి ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉంది. ఆడిన మూడు మ్యాచుల్లో ఒకటి ఓడిపోయి, మరో రెండింటిలో గెలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న ముంబయి ఇండియన్స్‌కు పాండ్య సోదరులు కీలక ఆటగాళ్లు. తొలి మ్యాచ్‌లో బెంగళూరుతో ఆడి ఓటమితో లీగ్‌ను ప్రారంభించిన ముంబయి.. ఈసారి కూడా కప్ నెగ్గి.. హ్యాట్రిక్ ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించాలని ఆశిస్తోంది.
ఇదీ చదవండి: 'మంచు కొంప ముంచింది.. కెప్టెన్సీ ఆస్వాదిస్తున్నా'