కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ను సెప్టెంబర్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే.. ఈ మెగాలీగ్ రెండో ఆంకానికి అతిథ్యమిచ్చేందుకు ఆసక్తి చూపింది శ్రీలంక క్రికెట్ బోర్డు. తొలుత ఇంగ్లీష్ కౌంటీలు ఈమేరకు ఐపీఎల్ నిర్వహణపై ఆసక్తి కనబరిచాయి. ఇటీవలే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు తమ విజ్ఞప్తిని కూడా తెలిపాయి.
కొన్ని సంస్థలు ఐపీఎల్ నిర్వహణపై ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ.. బీసీసీఐకి ఈ విషయంలో సందిగ్ధంగా ఉంది. అయితే.. ఐపీఎల్-14 నిర్వహణ అవకాశం తమకు ఇవ్వాలంటూ శ్రీలంక క్రికెట్ కమిటీ ఛీఫ్ అర్జున డిసిల్వ కోరారు. జులై-ఆగస్టులో లంక ప్రీమియర్ లీగ్ నిర్వహణ జరుగుతుందని చెప్పిన ఆయన.. సెప్టెంబర్‌లో ఐపీఎల్ నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(దుబాయి)లో.. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.
ఇదీ చదవండి:సెప్టెంబర్‌లో ఐపీఎల్.. ఎక్కడనేదే ప్రశ్న!