ETV Bharat / sports

సన్​రైజర్స్ కెప్టెన్​గా​ విలియమ్సన్.. వార్నర్​కు ఉద్వాసన - david warner SRH captain

SRH removed warner as captain
వార్నర్​ను కెప్టెన్​గా తప్పించిన సన్​రైజర్స్
author img

By

Published : May 1, 2021, 3:34 PM IST

Updated : May 1, 2021, 3:53 PM IST

15:31 May 01

డేవిడ్ వార్నర్​ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది సన్​రైజర్స్ హైదరాబాద్. అలాగే విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్​ను కూడా మారుస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రాజస్థాన్ రాయల్స్​తో జరిగే మ్యాచ్​లో వార్నర్​ ఉంటాడా?లేడా? అనేది సందేహంగా మారింది. తర్వాత మ్యాచ్​ నుంచి కేన్ విలియమ్సన్​ కెప్టెన్​గా ఉంటాడంటూ ప్రకటించింది. దీనిపై ఓ పోస్ట్ చేసింది సన్​రైజర్స్.  

"రేపు జరిగే మ్యాచ్​ నుంచి సన్​రైజర్స్ హైదరాబాద్​కు కేన్ విలియమ్సన్ కెప్టెన్​గా వ్యవహరిస్తాడని తెలుపుతున్నాం. అలాగే ఆదివారం రాజస్థాన్​ రాయల్స్​తో జరిగే మ్యాచ్​లో విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్​ను కూడా మార్చబోతున్నాం. కొన్నేళ్లుగా వార్నర్​ జట్టుకు ఎంతో సేవ చేశాడు. దానిని గౌరవిస్తున్నాం. తర్వాత కూడా వార్నర్​ మైదానంలోనూ, మైదానం బయటా జట్టుకు మద్దతుగా ఉంటాడని భావిస్తున్నాం."

                                             -సన్​రైజర్స్ పోస్ట్

ఈ సీజన్​లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్​లాడిన సన్​రైజర్స్ కేవలం ఒకే మ్యాచ్​లో గెలుపొందింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాన నిలిచింది. దీంతో జట్టుపై విమర్శలూ వస్తున్నాయి. దీంతో మేనేజ్​మెంట్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Last Updated : May 1, 2021, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.