తమ జట్టు నిరుత్సాహ ప్రదర్శనపై అభిమానులకు క్షమాపణలు చెప్పారు కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుక్ ఖాన్. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పది పరుగుల స్వల్ప తేడాతో ముంబయిపై ఓడింది కేకేఆర్.
మ్యాచ్ అనంతరం దీనిపై స్పందించిన బాలీవుడ్ స్టార్ షారుక్.. అభిమానులకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలిపారు.
-
Disappointing performance. to say the least @KKRiders apologies to all the fans!
— Shah Rukh Khan (@iamsrk) April 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Disappointing performance. to say the least @KKRiders apologies to all the fans!
— Shah Rukh Khan (@iamsrk) April 13, 2021Disappointing performance. to say the least @KKRiders apologies to all the fans!
— Shah Rukh Khan (@iamsrk) April 13, 2021
ఈ మ్యాచ్‌లో తొలుత ముంబయిని కేవలం 152 పరుగులకే కట్టడి చేసింది కోల్‌కతా. సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో మెరిశాడు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అనంతరం బరిలోకి దిగిన మోర్గాన్ సేన లక్ష్యానికి పది పరుగుల దూరంలో నిలిచిపోయింది. ముంబయి బౌలర్ రాహుల్ చాహర్.. నాలుగు వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదీ చదవండి: మహిళా జట్టు కోచ్ పదవీకి దరఖాస్తుల ఆహ్వానం
ఇది రెండో మ్యాచే కదా..
షారుక్ చేసిన ట్వీట్‌పై కోల్‌కతా ఆటగాడు ఆండ్రీ రస్సెల్ బదులిచ్చాడు. "షారుక్ ట్వీట్‌ను సమర్థిస్తాను. ఏదేమైనా క్రికెట్ అంటే ఇలాగే ఉంటుంది. ఆట ముగిసే వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేం. మేం నాణ్యమైన క్రికెట్ ఆడాం. కుర్రాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అపజయానికి నిరాశ చెందాం. కానీ ఇదే ముగింపు కాదు కదా. మాకిది రెండో మ్యాచే. పొరపాట్ల నుంచి మేం నేర్చుకుంటాం. నేను వందల టీ20 మ్యాచులు ఆడాను. చాలాసార్లు ఆధిపత్యం చెలాయించిన జట్లు హఠాత్తుగా ఓడిపోవడం చూశాను. మంగళవారం రాత్రీ అదే జరిగింది. జట్టులో మార్పులు చేసుకొని మరింత మెరుగవుతాం" అని రస్సెల్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: మహారాష్ట్రలో కర్ఫ్యూ.. ఐపీఎల్ మ్యాచ్‌లు యథాతథం