టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. ఇతడి బౌలింగ్‌ను అనుకరించడం కాస్త కష్టమైన పనే. అయితే రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్.. బుమ్రాతో పాటు అశ్విన్, హర్భజన్ సింగ్ బౌలింగ్ శైలిలను అనుకరించాడు. ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది రాజస్థాన్ ఫ్రాంచైజీ. 'తనకంటే నేనే బాగా బాగా బౌలింగ్ చేస్తున్నట్లు బుమ్రా తెలిపాడు' అని వెల్లడించాడు గోపాల్.
-
J̶a̶s̶p̶r̶i̶t̶.̶ ̶R̶a̶v̶i̶c̶h̶a̶n̶d̶r̶a̶n̶.̶ ̶H̶a̶r̶b̶h̶a̶j̶a̶n̶.̶ Shreyas Gopal ✅💗#HallaBol | #RoyalsFamily | #IPL2021 pic.twitter.com/I3hSeE8hJF
— Rajasthan Royals (@rajasthanroyals) April 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">J̶a̶s̶p̶r̶i̶t̶.̶ ̶R̶a̶v̶i̶c̶h̶a̶n̶d̶r̶a̶n̶.̶ ̶H̶a̶r̶b̶h̶a̶j̶a̶n̶.̶ Shreyas Gopal ✅💗#HallaBol | #RoyalsFamily | #IPL2021 pic.twitter.com/I3hSeE8hJF
— Rajasthan Royals (@rajasthanroyals) April 21, 2021J̶a̶s̶p̶r̶i̶t̶.̶ ̶R̶a̶v̶i̶c̶h̶a̶n̶d̶r̶a̶n̶.̶ ̶H̶a̶r̶b̶h̶a̶j̶a̶n̶.̶ Shreyas Gopal ✅💗#HallaBol | #RoyalsFamily | #IPL2021 pic.twitter.com/I3hSeE8hJF
— Rajasthan Royals (@rajasthanroyals) April 21, 2021
ఈ సీజన్లో రాజస్థాన్ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడిన శ్రేయస్ గోపాల్ 40 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇప్పటివరకు లీగ్‌లో ఆర్ఆర్ తరఫున 14 మ్యాచ్‌లాడి 10 వికెట్లు సాధించాడు.
ఈ సీజన్లో మూడు మ్యాచ్‌లాడిన రాజస్థాన్ ఒకే విజయాన్ని కైవసం చేసుకుంది. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆర్సీబీని నిలువరించడం ఆర్ఆర్కు కాస్త కష్టమనే చెప్పాలి.