ETV Bharat / sports

IPL 2021: కోల్​కతాతో మ్యాచ్​కు రోహిత్​, హార్దిక్ దూరం!

ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ, ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య.. కోల్​కతాతో మ్యాచ్​లో ఆడే విషయమై స్పష్టత లేదని అన్నాడు ఆ జట్టు పేసర్ ట్రెంట్ బౌల్ట్(Trent Boult on Rohit Sharma). చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్​లో కెప్టెన్​ రోహిత్​ శర్మ లేని లోటు కనిపించిందని తెలిపాడు.

trent boult
బౌల్ట్
author img

By

Published : Sep 23, 2021, 8:11 AM IST

Updated : Sep 23, 2021, 11:50 AM IST

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా వేగంగా కోలుకుంటున్నారని తెలిపాడు ఆ జట్టు పేసర్ ట్రెంట్ బౌల్ట్(Trent Boult on Rohit Sharma). అయితే.. గురువారం కోల్​కతా నైట్​రైడర్స్​తో జరగనున్న మ్యాచ్​లో మాత్రం వారిద్దరూ అందుబాటులో ఉండపోవచ్చని అభిప్రాయపడ్డాడు.

"రోహిత్, పాండ్యా కోలుకుంటున్నారు. రానున్న మ్యాచ్​లో వారు ఆడతారా లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. వారిద్దరూ ముంబయి జట్టులో కీలక ఆటగాళ్లు. వీలైనంత త్వరగా జట్టులో ప్రాతినిథ్యం వహించాలని వారూ కోరుకుంటున్నారు. సీఎస్​కేతో మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్​ లేని లోటు కనిపించింది. కానీ, అతడికి విశ్రాంతి ఇవ్వాలని టీమ్​ మేనేజ్​మెంట్ తీసుకున్న నిర్ణయం సరైనదే."

--ట్రెంట్ బౌల్ట్, ముంబయ్ ఇండియన్స్ పేసర్.

ఐపీఎల్​లో గురువారం కోల్​కతా నైట్​రైడర్స్​తో ముంబయి ఇండియన్స్(MI vs KKR 2021)​ తలపడనున్న నేపథ్యంలో బౌల్ట్​ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరిచింకుంది. అయితే.. గతంలో కోల్​కతాపై మంచి ఫలితాలనే రాబట్టింది ముంబయి జట్టు.. అయినా కోల్​కతాను తక్కువ అంచనా వేయడానికి లేదని ట్రెంట్​ బౌల్ట్​ పేర్కొన్నాడు.

ఐపీఎల్​ రెండోదశలోని తొలి మ్యాచ్​లో సీఎస్కేతో తలపడిన ముంబయి జట్టు.. కెప్టెన్ రోహిత్, హార్దిక్ లేకుండానే బరిలోకి దిగింది. కిరన్ పొలార్డ్ సారథ్యంలో చెన్నై సూపర్​కింగ్స్​ చేతిలో ఓటమిపాలైంది.

ఇదీ చదవండి: Ml vs CSK: ప్రతీకారం తీర్చుకున్న సీఎస్​కే.. ముంబయిపై విజయం

Last Updated : Sep 23, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.