టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ను విమర్శిస్తున్నట్లు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్విట్టర్ ఖాతా నుంచి ఓ ట్వీట్ ప్రత్యక్షమయ్యింది. ఇప్పుడా ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆదివారం ఎలాన్ మస్క్ తాను పెంచుకుంటున్న కొత్త కుక్కపిల్లను పరిచయం చేస్తూ చేసిన ట్వీట్‌కు.. ఆర్సీబీ ఖాతాతో విమర్శిస్తూ కామెంట్ వచ్చింది. "ఫ్లోకి వచ్చేసింది" అంటూ తన కుక్కపిల్ల ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు మస్క్. దీనిపై ఆర్సీబీ ఈ విధంగా స్పందించింది.
"2020లో టెస్లా ద్వారా పర్యావరణ పరిరక్షణ పేరుతో దాదాపుగా రూ.11.05 వేల కోట్ల(1.5 బిలియన్ డాలర్లు) సబ్సీడీని పొందిన మస్క్.. ఇప్పుడదే మొత్తాన్ని బిట్‌కాయిన్‌పై పెట్టుబడి పెట్టారు" అంటూ ఆర్సీబీ ఖాతా నుంచి కామెంట్ వచ్చింది. అలా చేసిన వెంటనే సోషల్‌మీడియాలో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది.
![RCB send out tweet slamming Elon Musk over Bitcoin mining, claim Twitter account was hacked](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13051288_tweet.jpg)
దీనిపై స్పందించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్రాంఛైజీ.. జట్టుకు సంబంధించిన అధికారిక ఖాతా హ్యాక్ అయిందని ఆరోపించింది. వెంటనే దానికి సంబంధించిన కామెంట్‌నూ తొలగించింది. మస్క్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్‌ను తాము ఖండిస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత వెంటనే తమ ఖాతాను ఫ్రాంఛైజీ అధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి.. అప్పటి పరిస్థితిని తలచుకొని మస్క్ కంటతడి!