ETV Bharat / sports

కరోనా వారియర్స్ గౌరవార్థం కొత్త జెర్సీలో ఆర్సీబీ - కొవిడ్ వారియర్స్​ కోసం ఆర్సీబీ కొత్త జెర్సీ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారతదేశానికి అండగా ఉండటానికి రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు​ ఫ్రాంఛైజీ ముందుకొచ్చింది. ఇకపై జరగనున్న మ్యాచ్​ల్లో బ్యూ కలర్​తో డిజైన్​ చేసిన ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. వాటిని వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని వైద్య అవసరాలతో పాటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ సరఫరా కోసం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

bengalore new jersey, virat kohli
ఆర్సీబీ కొత్త జెర్సీ, విరాట్ కోహ్లీ
author img

By

Published : May 2, 2021, 11:35 AM IST

కొవిడ్​తో పోరాడుతున్న భారతదేశానికి తాము అండగా ఉంటామంటోంది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఫ్రాంఛైజీ. తమ వంతుగా సాయం చేయడమే కాకుండా విరాళాల సేకరణకు కృషి చేస్తామని తెలిపింది. అందుకోసం కొత్తగా తయారు చేసిన బ్లూ కలర్​ జెర్సీని రానున్న మ్యాచ్​ల్లో ధరిస్తామని పేర్కొంది. వాటిని వేలం వేయగా వచ్చిన నిధులను దేశంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ సరఫరా కోసం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది ఆర్సీబీ.

  • This season RCB is going to be sporting a special Blue jersey in 1 of the upcoming matches with key messaging on the match kit to pay our respect & show solidarity to all the front line heroes who have spent last year wearing PPE kits & leading the fight against the pandemic. pic.twitter.com/HUOAL12VVy

    — Royal Challengers Bangalore (@RCBTweets) May 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"బెంగళూరుతో పాటు దేశంలోని ఏయే ప్రాంతాల్లో ఆక్సిజన్​ కొరత ఉందో.. వైద్య పరికరాల అవసరం ఉందో అక్కడ ఆర్సీబీ సాయం అందిస్తుంది. అంతేకాకుండా రానున్న మ్యాచ్​ల్లో ప్రత్యేక జెర్సీ ధరించనున్నాం. గతేడాది కొవిడ్ నియంత్రణలో భాగంగా ముందుండి పోరాడిన ఉద్యోగుల గౌరవార్థం ఈ జెర్సీలను ధరించనున్నాం. వీటిని వేలం వేయగా వచ్చిన నిధులను దేశంలోని ఆక్సిజన్ సరఫరా కోసం ఇవ్వనున్నాం."

-విరాట్ కోహ్లీ, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్.

ఐపీఎల్​లో సోమవారం జరగనున్న మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్​ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. కొవిడ్​తో పోరాడుతున్న దేశానికి.. ఇప్పటికే పలువురు క్రికెటర్లు, ఫ్రాంఛైజీలు మద్దతుగా నిలుస్తున్నాయి.

ఇదీ చదవండి: ఐపీఎల్​: సురేశ్​ రైనా ఖాతాలో మరో ఘనత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.