ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది ఆర్సీబీ. హోరా హోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓటమిని చవి చూస్తున్న ఆర్సీబీకి ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ టీమ్‌లోని ఫినిషర్ దినేశ్ కార్తీక్ అనారోగ్యం పాలయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొదలు నుంచి నుంచి డీకే అంతగా రాణించట్లేదు. ఫామ్ లేమి కారణం చేత కూడా అతను ట్రోల్‌కు సైతం గరయ్యాడు. అయితే గత రెండు మ్యాచుల్లో మాత్రం కొంచెం అద్భుత ప్రదర్శన చూపిస్తున్నట్లే కనిపించాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లోనూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఇటువంటి వార్త అభిమానులను ఆందోళన కలిగించేలా చేస్తోంది.
ముంబయితో జరిగిన మ్యాచ్‌లో కేవలం 18 బాల్స్‌లోనే 30 రన్స్ స్కోర్ చేసిన డీకే.. ఆర్సీబీ టార్గెట్ సాధించేందుకు తన వంతు కృషి చేశాడు. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఔటైన ఈ స్టార్ పేసర్ పెవిలియన్ వెళ్లే సమయంలో తడబడ్డాడు. కిందకు వంగిపోతూ చాలా ఇబ్బందిగా మైదానాన్ని వీడాడు. ఇక ఆ తర్వాత జరిగిన ఇన్నింగ్స్‌లోనూ అతను ఆడలేదు. దీంతో అతని స్థానంలో అనూజ్ రావత్ వచ్చి.. కీపింగ్ చేశాడు. మరోవైపు దినేశ్ అనారోగ్యంపై ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ స్పందించారు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే దినేశ్.. డీహైడ్రేషన్‌కు గురయ్యాడని వెల్లడించారు. దీని వల్లనే అతను అనారోగ్యానికి గురైనట్లు తెలిపాడు.
-
Dinesh Karthik was unwell but still played a cameo inning for RCB and that's the reason he is not wicket keeping today. #MIvsRCB #RCBvsMI pic.twitter.com/FUingxJDPz
— Vikram Rajput (@iVikramRajput) May 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dinesh Karthik was unwell but still played a cameo inning for RCB and that's the reason he is not wicket keeping today. #MIvsRCB #RCBvsMI pic.twitter.com/FUingxJDPz
— Vikram Rajput (@iVikramRajput) May 9, 2023Dinesh Karthik was unwell but still played a cameo inning for RCB and that's the reason he is not wicket keeping today. #MIvsRCB #RCBvsMI pic.twitter.com/FUingxJDPz
— Vikram Rajput (@iVikramRajput) May 9, 2023
"ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలోనే దినేశ్ కొంత ఇబ్బంది పడ్డాడు. డీహైడ్రేట్ అవ్వడం వల్ల పెవిలియన్‌కు చేరుకునే సమయంలోనూ వాంతులు కూడా చేసుకున్నాడు. అయితే వచ్చే మ్యాచ్ సమయానికి తను కచ్చితంగా కోలుకుంటాడనే అనుకుంటున్నాం. ఎందుకంటే రానున్న మ్యాచ్‌కు మధ్యలో మూడు, నాలుగు రోజుల గ్యాప్ ఉంది. ఇక చికిత్స తీసుకుని మందులు వేసుకుంటే అతను తర్వాతి మ్యాచ్‌కు రెడీగా ఉంటాడు' అని పేర్కొన్నారు.
దినేశ్ క్యాచ్ మిస్.. ఆనందంలో అనుష్క..
ఇక ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఇన్నింగ్స్ చివరిలో దినేశ్ కార్తీక్ ఆడుతున్న సమయంలో అతను కొట్టిన బాల్‌ను క్యాచ్ పట్టేందుకు కామెరూన్ గ్రీన్ ముందుకొచ్చాడు. అయితే అతను ఆ క్యాచ్‌ను వదిలేశాడు. బౌండరీ లైన్ వద్ద చేతుల్లోకి వచ్చిన బంతిని గ్రీన్ వదిలేయడం వల్ల రోహిత్ అసహనానికి గురయ్యాడు.. కానీ గ్రీన్ క్యాచ్ వదిలేయడాన్ని చూసి గ్యాలరీలో కూర్చున్న అనుష్క శర్మ సెలబ్రేట్ చేసుకుంది. దినేశ్ కొట్టిన బంతి గాల్లో ఉన్న సమయంలో ఆందోళన చెందిన అనుష్క.. క్యాచ్ మిస్ కాగానే లేచి నిల్చుని సంతోషాన్ని వ్యక్తం చేసింది.
-
Anushka Sharma's reaction on Kartik's catch drop 🥰♥️ pic.twitter.com/NPTC0zA27f
— Kuldeep Sharma (@RCB_Tweets__) May 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Anushka Sharma's reaction on Kartik's catch drop 🥰♥️ pic.twitter.com/NPTC0zA27f
— Kuldeep Sharma (@RCB_Tweets__) May 9, 2023Anushka Sharma's reaction on Kartik's catch drop 🥰♥️ pic.twitter.com/NPTC0zA27f
— Kuldeep Sharma (@RCB_Tweets__) May 9, 2023