ETV Bharat / sports

IPL 2021 : ఆర్​సీబీలో భారీ మార్పులు.. జట్టుకు కొత్త కోచ్​! - ఐపీఎల్​ 2021

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు హెడ్​ కోచ్​గా సైమన్​ క్యాటిచ్​ తప్పుకున్నాడు. ఆ స్థానంలో మైక్​ హెస్సన్​ను నియమించింది ఆ జట్టు యాజమాన్యం. జట్టులోకి శ్రీలంక స్పిన్నర్​ హసరంగ సహా మరో ఇద్దరు ఆటగాళ్లు రానున్నట్లు యాజమాన్యం ప్రటించింది. ఐపీఎల్​ (IPL 2021) రెండో దశ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మార్పులు జట్టుకు కీలకంగా మారాయి.

rcb makes key changes
ఆర్​సీబీలో భారీ మార్పులు.. జట్టుకు కొత్త కోచ్​!
author img

By

Published : Aug 21, 2021, 5:09 PM IST

Updated : Aug 21, 2021, 10:20 PM IST

సెప్టెంబరులో దుబాయి వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్​ (IPL 2021) రెండో దశకు జట్లన్నీ సిద్ధమవుతున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భారీ మార్పులు చేసింది. ప్రస్తుతం జట్టుకు ప్రధాన కోచ్​గా కొనసాగుతున్న సైమన్​ క్యాటిచ్​ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాడు. ఆ స్థానంలో మైక్​ హెస్సన్​ బాద్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆర్​సీబీ శనివారం వెల్లడించింది.

ఆటగాళ్లలో డేనియల్​ శామ్స్ స్థానంలో శ్రీలంకకు చెందిన దుష్​మంత చమీరా, ఫిన్​ అలెన్ స్థానంలో సింగపూర్​ ఆటగాడు టిమ్​ డేవిడ్​లు జట్టులోకి రానున్నారు. స్పిన్నర్​ ఆడమ్​ జంపా స్థానంలో శ్రీలంక స్పిన్నర్​ వానిందు హసరంగను ఫ్రాంచైజ్ నియమించింది. ఇటీవల భారత్​తో జరిగిన సిరీస్​లో మెరుగైన ప్రదర్శన చేసిన హసరంగపై ఆర్​సీబీకి భారీ అంచనాలు ఉన్నాయి. హసరంగపై తమకు ఎప్పటినుంచో దృష్టి ఉందని వెల్లడించారు ఆర్​సీబీ కొత్త కోచ్​ హెస్సన్.

మొదటి దశలో 7 మ్యాచ్​లలో 5 గెలిచి మెరుగైన ప్రదర్శనను చేసిన ఆర్​సీబీ.. రెండో దశలో కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. జట్టు ఆటగాళ్లు ఆగస్టు 29న యూఏఈ చేరుకుంటారు.

ఇదీ చదవండి : IPL 2021: పోరుకు సిద్ధమవుతున్న సీఎస్కే, ముంబయి

Last Updated : Aug 21, 2021, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.