ఐపీఎల్ రెండోదశలో(IPL 2021) రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో(DC Vs RR) రాజస్థాన్ టీమ్ స్లోఓవర్ రేటు(Slow Over Rate in IPL) కారణమైంది. దీంతో రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఐపీఎల్ నిర్వాహకులు మరోసారి జరిమానా విధించారు. ప్రస్తుత టోర్నీలో రెండోసారి నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా శాంసన్‌కు(Sanju Samson News) రూ.24 లక్షల జరిమానాతో పాటు తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజు నుంచి 25 శాతం కోత విధించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇటీవలే పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ(RR Vs PBKS) రాజస్థాన్ రాయల్స్ టీమ్ స్లో ఓవర్ రేటుకు కారణమైంది. తొలిసారి ఓవర్ రేటు(Over Rate in IPL) నిబంధనలను అతిక్రమించిన కారణంగా ఆ మ్యాచ్‌లో కెప్టెన్ శాంసన్‌కు రూ.12 లక్షల జరిమానాను ఐపీఎల్ నిర్వాహకులు విధించారు. ఒకవేళ మూడోసారి ఇదే తప్పు చేస్తే రూ.30 లక్షల జరిమానా సహా ఒక మ్యాచ్ నిషేధం(కెప్టెన్).. తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ.12 లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.
అద్భుతంగా బ్యాటింగ్ చేసినా..
ఐపీఎల్ 2021లో విజయాల పరంపర కొనసాగిస్తోంది దిల్లీ క్యాపిటల్స్(RR vs DC 2021). ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఈ జట్టు శనివారం (సెప్టెంబర్ 25) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గెలుపొందింది. 33 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో(IPL points Table 2021) అగ్రస్థానంలోకి వెళ్లింది. దీంతో ప్లే ఆఫ్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది.
దిల్లీ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని(RR Vs DC 2021 Scorecard) ఛేదించడంలో విఫలమైంది రాజస్థాన్. ఓపెనర్లు లివింగ్‌స్టోన్(1), జైస్వాల్(5)తో పాటు స్టార్ బ్యాట్స్‌మెన్ మిల్లర్ (7), మహిపాల్ లోమ్రోర్ (19), రియాన్ పరాగ్ (2) విఫలయ్యారు. కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson IPL) పట్టుదలగా ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా జట్టును భారీ ఓటమి నుంచి తప్పించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అర్ధసెంచరీ సాధించాడు. చివరి వరకు క్రీజులో ఉన్న శాంసన్ 70 పరుగులతో నాటౌట్ నిలిచినా.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.
ఇదీ చూడండి.. IND Vs ENG: రద్దయిన టెస్టు నిర్వహణపై క్లారిటీ