వివిధ కారణాలతో నలుగురు విదేశీ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్.. క్రికెటర్లను అరువు ఇవ్వమని మిగిలిన ఫ్రాంఛైజీలను కోరింది. గాయాల కారణంగా స్టోక్స్, ఆర్చర్ ఆ జట్టుకు దూరమవగా.. బబుల్ ఆందోళనతో లివింగ్స్టన్, పెరుగుతోన్న పాజిటివ్ కేసుల కారణంగా భారత్‌లోనే చిక్కుకుపోతానేమోననే భయంతో ఆండ్రూ టై తమ దేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఆ జట్టుపై గట్టి ప్రభావమే పడింది.
"ఆటగాళ్లను అరువు తెచ్చుకోవడం కోసం మిగతా ఫ్రాంఛైజీలకు రాజస్థాన్ లేఖలు రాసింది. కానీ ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని ఆ జట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ సీజన్లో ఇతర ఫ్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లను జట్లు అరువు తెచ్చుకునే ప్రక్రియ సోమవారం మొదలైంది. లీగ్ దశ ముగిసే వరకు ఇది కొనసాగుతోంది. ఈ సీజన్లో రెండు కంటే తక్కువ మ్యాచ్‌లాడిన ఆటగాడ్ని ఇతర జట్లు అరువుగా తీసుకోవచ్చు. ఆ ఆటగాడు తన సొంత జట్టుపై మ్యాచ్‌లో ఆడకూడదు. ఇప్పటివరకూ లీగ్‌లో అయిదు మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది.
ఇదీ చూడండి.. కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్