రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా.. దక్షిణాఫ్రికా టాప్ స్పిన్నర్ తబ్రైజ్ షంసీతో(Tabraiz Shamsi) ఒప్పందం కుదుర్చుకుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడీ ఎడమ చేతి వాటం స్పిన్నర్. ఐపీఎల్ తొలి దశలో కరోనా కారణంగా అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిన ఆస్ట్రేలియన్ పేసర్ ఆండ్రూ టై స్థానంలో షంసీని జట్టులో చేర్చుకుంది.
జోహాన్నెస్‌బర్గ్‌కు చెందిన 31ఏళ్ల షంసీ.. దేశవాళీ క్రికెట్‌లో 'ది టైటాన్స్'కు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఆడిన 27 వన్డేల్లో 32 వికెట్లతో పాటు.. 39 టీ20ల్లో 45 వికెట్లు తీశాడు.
ఇంతకుముందు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన షంసీ 3 వికెట్లు పడగొట్టాడు. 2016 సీజన్‌లో షంసీని రిజర్వు ఆటగాడిగానే ఉంచింది బెంగళూరు.
ఐపీఎల్-2021 తొలి దశలో ఏడు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఈ మెగా లీగ్ రెండో దశ ప్రారంభంకానుంది. పలు జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకుని కసరత్తులు షురూ చేశాయి.
ఇదీ చూడండి: రాజస్థాన్‌కు షాక్.. ఐపీఎల్‌కు బట్లర్ దూరం