తమ ఆటగాళ్లు పరిస్థితుల్ని అర్ధం చేసుకుని, బాధ్యతల్ని నిర్వర్తించారని మహేంద్రసింగ్ ధోనీ(dhoni six) అన్నాడు. బెంగళూరుతో షార్జాలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. అనంతరం మాట్లాడిన ధోనీ.. తమ ప్లేయర్ల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.
"మా ఆటగాళ్లు చాలా కష్టపడ్డారు. పరిస్థితుల్ని అర్ధం చేసుకుని రాణించారు. మూడు మైదానాల్లో ఇది చాలా నెమ్మదైన పిచ్. అయినాసరే మా ప్లేయర్లు మ్యాచ్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మంచు ప్రభావం ఉండటం వల్ల రెండోసారి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే టాస్ గెలవగానే బౌలింగ్ తీసుకున్నాం. బ్రావో కాకుండా హేజిల్‌వుడ్, శార్దుల్, దీపక్ చాహర్ బాగా ఆడారు" అని ధోనీ(dhoni age) చెప్పాడు.
అలానే ఈ మ్యాచ్‌లో కోహ్లీ వికెట్ తీసి, మ్యాచ్ తమ కంట్రోల్లోకి తీసుకొచ్చిన బ్రావో.. తన సోదరుడు లాంటివాడని ధోనీ(dhoni net worth) అన్నాడు.
"175 పరుగులనేవి విజయవంతమైన స్కోరే. కానీ లక్ష్యం చేయకుండా ప్రత్యర్థిని మా బౌలర్లు అడ్డుకోలేకపోయారు. బౌండరీలు కూడా చాలావరకు వదిలేశారు. మరో 15-20 పరుగులు మేం(csk vs rcb) చేసుంటే బాగుండేది" అని బెంగళూరు కెప్టెన్ కోహ్లీ(kohli ipl runs) చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 156/6 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్(70), కోహ్లీ(53) అద్భుత బ్యాటింగ్ చేసినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. అనంతరం బరిలో దిగిన చెన్నై.. 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. బ్రావో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ఇవీ చదవండి: