కోల్‌కతా-ముంబయి మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌పై పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. అద్భుత విజయం సాధించిన ముంబయిపై మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ప్రశంసలు కురిపించగా.. గెలిచే మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయిన కోల్‌కతాను మాజీ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా విమర్శించాడు.
"ముంబయితో మ్యాచ్‌లో కోల్‌కతా నిర్లక్ష్యాన్ని చూశారు. 30 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో కేకేఆర్ చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. అయినా మ్యాచ్‌ను కోల్పోయింది. రోహిత్ సేన గొప్పగా బౌలింగ్ చేసింది" అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
-
MI to KKR- Dekha aapne laparwahi ka.natija.
— Virender Sehwag (@virendersehwag) April 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
To defend 31 from 30 balls with 7 wickets of the opposition in hand is something which not many sides can defend. Brilliant bowling display from @mipaltan .#MIvsKKR pic.twitter.com/dIdd603wKL
">MI to KKR- Dekha aapne laparwahi ka.natija.
— Virender Sehwag (@virendersehwag) April 13, 2021
To defend 31 from 30 balls with 7 wickets of the opposition in hand is something which not many sides can defend. Brilliant bowling display from @mipaltan .#MIvsKKR pic.twitter.com/dIdd603wKLMI to KKR- Dekha aapne laparwahi ka.natija.
— Virender Sehwag (@virendersehwag) April 13, 2021
To defend 31 from 30 balls with 7 wickets of the opposition in hand is something which not many sides can defend. Brilliant bowling display from @mipaltan .#MIvsKKR pic.twitter.com/dIdd603wKL
ఇదీ చదవండి: షారుక్ క్షమాపణలు.. బదులిచ్చిన రస్సెల్
"మ్యాచ్ తమ నియంత్రణలో ఉన్నప్పటికీ కోల్‌కతా ఓడిపోయింది. 36 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముంబయితో మ్యాచ్‌లో మోర్గాన్ సేనను పూర్తి నిర్ణక్ష్యం ఆవహించింది. ప్రత్యర్థి జట్టు సరైన సమయంలో మంచి బౌలర్లను బరిలోకి దింపింది. వారు చివరి వరకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. విజయానికి రోహిత్ సేన పూర్తిగా అర్హులు. చెపాక్‌లో సగటు స్కోరు 145 పరుగులనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుండేది" అని లారా కోల్‌కతా జట్టుపై విమర్శలు చేశాడు.
ఇదీ చదవండి: టోక్యో ఒలింపిక్స్ లోగో, మస్కట్ ఆవిష్కరణ