శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత సోమవారం డిశ్చార్జ్ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న ముత్తయ్యకు శనివారం గుండెపోటు రావడం వల్ల ఆసుపత్రిలో చేర్చారు. ఆపై ఆదివారం యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేసి స్టెంట్ అమర్చి సోమవారం డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. మురళీధరన్ తిరిగి గతంలో మాదిరిగా పనిచేసుకోవచ్చని డాక్టర్లు స్పష్టం చేశారు.
శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్.. ఆ జట్టు తరఫున 133 టెస్టులు, 350 వన్డేలు, 12 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో అత్యధికంగా 800 వికెట్లను పడగొట్టాడు. అదే విధంగా వన్డేల్లో 534, టీ20ల్లో 13 వికెట్లను సాధించాడు. 1996 ప్రపంచకప్ విజేతగా నిలిచిన శ్రీలంక జట్టులో ముత్తయ్య మురళీధరన్ భాగమయ్యాడు.
ఇదీ చూడండి: దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌కు స్టెంట్