ETV Bharat / sports

MI Vs RR: ముంబయి ఘనవిజయం.. రోహిత్ అరుదైన రికార్డు - రాజస్థాన్ రాయల్స్ లైవ్ స్కోర్

రాజస్థాన్​ రాయల్స్​పై ఘనవిజయం సాధించింది ముంబయి ఇండియన్స్ (MI Vs RR). కేవలం 2 వికెట్లు కోల్పోయి 8.2 ఓవర్లలోనే 91 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

MI Vs RR 2021
ఐపీఎల్ మ్యాచ్
author img

By

Published : Oct 5, 2021, 10:22 PM IST

Updated : Oct 5, 2021, 10:50 PM IST

ప్లే ఆఫ్స్‌ (IPL 2021) చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ అదరగొట్టింది. రాజస్థాన్‌ రాయల్స్‌ను (MI Vs RR) ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. రాజస్థాన్‌ నిర్దేశించిన 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 8.2 ఓవర్లలోనే ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌ (50) అర్ధ శతకంతో రాణించాడు. ధాటిగా ఆడిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (22) చేతన్‌ సకారియా బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (13) త్వరగానే ఔటయ్యాడు. రాజస్థాన్ బౌలర్లలో సకారియా, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​ దిగిన రాజస్థాన్.. ముంబయి ఇండియన్స్ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ (24) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వీ జైస్వాల్‌ (12) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (3), శివమ్‌ దూబె (3), గ్లెన్ ఫిలిప్స్‌ (4) విఫలమయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌ (15), రాహుల్ తెవాటియా (12) జోడి నిలకడగా ఆడుతూ క్రీజులో కుదురుకుంటున్న సమయంలో జిమ్మీ నీషమ్‌ వీరిని విడగొట్టాడు. 14.6 బంతికి రాహుల్ తెవాటియా కీపర్‌కి చిక్కాడు. కొద్దిసేపటికే మిల్లర్ కూడా పెవిలియన్ చేరాడు. ఆఖర్లో వచ్చిన శ్రేయస్ గోపాల్ (0), సకారియా (6) రాణించలేకపోయారు. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్ (8) నాటౌట్‌గా నిలిచాడు. ముంబయి బౌలర్లలో నాథన్‌ కౌల్టర్ నైల్ నాలుగు, జిమ్మీ నీషమ్ మూడు, బుమ్రా రెండు వికెట్లు తీశారు.

రాజస్థాన్ చెత్త రికార్డు..

ఈ మ్యాచ్​తో చెత్త రికార్డు మూటగట్టుకుంది రాజస్థాన్ రాయల్స్​. ఐపీఎల్​ 2021లో ఒక జట్టు నమోదు చేసిన అత్యల్ప స్కోరు (90) ఇదే. ఆ తర్వాత 92 పరుగులతో బెంగళూరు ఉంది.

రోహిత్ శర్మ రికార్డు..

టీ20ల్లో అరుదైన రికార్డు సాధించాడు రోహిత్ శర్మ. అంతర్జాతీయ, ఐపీఎల్ సహా ఇతర లీగ్​ల్లో కలిపి 400 సిక్సర్లు బాదాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ హిట్​మ్యాన్. రోహిత్ తర్వాత సురేశ్ రైనా (325 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (320), ఎంఎస్ ధోనీ (304), యువరాజ్ సింగ్ (261) ఉన్నారు.

ఇదీ చూడండి: IPL 2021: ఈ నాలుగు జట్లలో ప్లేఆఫ్స్ చేరేదెవరు?

Last Updated : Oct 5, 2021, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.