MS Dhoni knee surgery : ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మోకాలి గాయంతో ఎంత ఇబ్బంది పడ్డాడో క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. వికెట్ల మధ్య పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డాడు. కానీ అలా ఇబ్బంది పడుతూనే.. ఆఖరి రెండు ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగి భారీ షాట్లతో అభిమానులను అలరించాడు. తమ జట్టు సీఎస్కేకు ఐదో ట్రోఫీని అందించి.. ముంబయి టైటిళ్ల రికార్డును సమం చేశాడు. అనంతరం ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం జాయిన్ అయ్యాడు. అతడికి సర్జరీ అవసరమని వైద్యులు అన్నారు.
అయితే ఇప్పుడా మోకాలి సర్జరీ విజయంవంతగా పూర్తైంది. ఈ విషయాన్ని బీసీసీఐ మెడికల్ ప్యానెల్ మెంబర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పర్దివాలా తెలిపారు. "అవును మహీ సర్జరీ.. కోకిలాబెన్ హాస్పిటల్లో విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడు. రిహాబిలిటేషన్ ప్రారంభం ముందు అతడికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. వచ్చే ఐపీఎల్లో ఆడేందుకు, మరింత ఫిట్‌గా తయారేందుకు కావాల్సినంత సమయం ఉంది" అని పర్దివాలా చెప్పారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈయనే.. గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్‌కు కూడా చికిత్స అందించారు.
అలాగా ఈ విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ కూడా ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. మరో రెండు రోజులు మహేంద్రుడు హాస్పిటల్లోనే ఉంటాడని అన్నారు. "శస్త్రచికిత్స తర్వాత మహీతో మాట్లాడాను. సర్జరీ గురించి నేను వివరించలేను కానీ.. అది కీ హోల్ సర్జరీ అని మాత్రమే చెప్పగలను. అతడు బాగానే ఉన్నాడు" అని విశ్వానాథన్ చెప్పుకొచ్చారు.
-
Supreme Speed ft Thala ⚡️#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/R27YHjq9f1
— Chennai Super Kings (@ChennaiIPL) June 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Supreme Speed ft Thala ⚡️#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/R27YHjq9f1
— Chennai Super Kings (@ChennaiIPL) June 1, 2023Supreme Speed ft Thala ⚡️#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/R27YHjq9f1
— Chennai Super Kings (@ChennaiIPL) June 1, 2023
రిటైర్మెంట్పై ధోనీ ఏమన్నాడంటే..
Dhoni IPL Retirement : వయసు కూడా 42 ఏళ్లకు చేరువ అవ్వడం వల్ల ఈ సీజన్‌తోనే ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించేస్తాడేమో అన్న చర్చ కూడా సాగింది. హోం గ్రౌండ్, బయట మైదానాల్లోనూ అతడి కోసమే క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే అతడు.. సీజన్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. కష్టమైనప్పటికీ అభిమానుల కోసం ఇంకో సీజన్ ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పి తన ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగించాడు.
ఇదీ చూడండి :
IPL 2023 Awards : చెన్నై పాంచ్ పటాకా.. ఈ సీజన్ అవార్డులు, రివార్డులు ఇవే!
IPL 2023 CSK : రెమ్యూనరేషన్ తక్కువ.. పెర్ఫామెన్స్ ఎక్కువ! సీఎస్కే విజయంలో వీరే కీలకం!