కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్లో ఆడుతున్న పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు లీగ్ నుంచి తప్పుకొంటున్నారు. దీని గురించి మాట్లాడిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ లబుషేన్.. తాను ఈ సీజన్లో ఆడకపోవడం అదృష్టమని చెప్పాడు.
ఈ ఐపీఎల్ వేలంపాటలో లబుషేన్‌ను కొనుగోలు చేయడంపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అతడు ఈ సీజన్‌కు దూరమవ్వాల్సి వచ్చింది.
"ఈ గడ్డు పరిస్థితిలో ఐపీఎల్లో లేకపోవడం ఓ వరం అని భావిస్తున్నాను. నేను ఈ మెగాలీగ్ను ఎంతో ప్రేమిస్తాను. ఇందులో భాగస్వామ్యం ఎంతో గొప్పగా అనుకుంటున్నాను. ఓ నాణానికి రెండు వైపులు ఉంటాయి. నేను ఈ లీగ్‌లో ఉన్నా ఆటకు దూరంగా ఉండేవాడిని. ఎందుకంటే భారత్‌లో పరిస్థితులు సరిగ్గాలేవు" అని అన్నాడు.
ప్రస్తుత ఐపీఎల్ బయోబబుల్‌ను సురక్షితంగా భావించనందునే తమ దేశ ఆటగాళ్లు తిరిగి వచ్చేస్తున్నారని అన్నాడు లబుషేన్. ఈ విషయాన్ని వారే తనతో స్వయంగా చెప్పారని వెల్లడించాడు.
ఇదీ చూడండి.. ఆగస్టులో కరేబియన్ ప్రీమియర్ లీగ్