ETV Bharat / sports

'ప్రత్యేక ఏర్పాట్లు చేయండి- అదేం కుదరదు' - cricket australia news

కరోనా రెండో దశ నేపథ్యంలో ఐపీఎల్ సాఫీగా జరిగే అవకాశాలు కనిపించట్లేదు. కొవిడ్ భయంతో లీగ్​ను వీడుతున్న ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది! ఇప్పటికే భారత్​ నుంచి విమానాల రాకపోకలను నిషేధించింది ఆసీస్. దీంతో ఇండియాలో ఉన్న మిగతా ఆసీస్​ క్రికెటర్లలోనూ కంగారు మొదలైంది!

chris lynn, scott morrison
క్రిస్ లీన్, స్కాట్ మోరిసన్
author img

By

Published : Apr 27, 2021, 3:13 PM IST

తమను స్వదేశానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక చార్టర్డ్‌ విమానం ఏర్పాటు చేయాలని ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్‌ లీన్‌.. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)ను కోరాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఐపీఎల్‌ టోర్నీపైనా పడింది. ఇప్పటికే నలుగురు ఆటగాళ్లు టోర్నీ నుంచి నిష్క్రమించారు. వీరిలో ఆసీస్​ ఆటగాళ్లు ఆండ్రూ టై, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా ఇప్పటికే లీగ్​ను వీడారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఆసీస్​ ప్లేయర్లకు.. టోర్నీ ముగిసిన వెంటనే సురక్షితంగా స్వదేశం చేరేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాల్సిందిగా క్రిస్‌ లీన్‌.. క్రికెట్‌ ఆస్ట్రేలియాను కోరాడు.

"ఏటా ఐపీఎల్‌ ఒప్పందంలో భాగంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా 10 శాతం మొత్తాన్ని చార్టర్డ్‌ విమానం కోసం ఖర్చు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరాను. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని తెలుసు. అయితే మేము కఠిన నియమ నిబంధనలు కలిగిన బబుల్‌లో ఉన్నాం. వచ్చే వారం వ్యాక్సిన్‌ కూడా తీసుకుంటాం. ప్రభుత్వం ప్రత్యేక విమానంలో మమ్మల్ని స్వదేశానికి అనుమతిస్తుందని అనుకుంటున్నాం" అని క్రిస్‌ లీన్‌ అభిప్రాయపడ్డాడు. భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించిన నేపథ్యంలో లీన్‌ ఇలా అభ్యర్థించాడు.

ఇదీ చదవండి: 'వచ్చే వారంలో క్రికెటర్లకు వాక్సిన్​!'

మరోవైపు, ఐపీఎల్‌ ఆడుతున్న ఆసీస్‌ ఆటగాళ్లు స్వదేశానికి రావడానికి సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్‌ ప్రకటించారు. "వారంతా అక్కడకు ప్రైవేట్‌గా వెళ్లారు. ఇదేమీ ఆస్ట్రేలియా అధికారిక పర్యటన కాదు. వాళ్లకు సొంత వనరులు ఉన్నాయి. వారు వాటిని ఉపయోగించుకోవచ్చు. వ్యక్తిగతంగా ఏర్పాట్లు చేసుకుని వారంతా ఆస్ట్రేలియాకు వస్తారని భావిస్తున్నా" అని మోరిసన్‌ ప్రకటించాడు.

ఇదిలా ఉండగా, "పరిస్థితులు చేయి దాటిపోతే తప్ప.. లీగ్ చివరి వరకు ఆసీస్​ ఆటగాళ్లు ఐపీఎల్​లో కొనసాగుతారని.. క్రికెట్​ ఆస్ట్రేలియా వర్గాలు తెలిపినట్లు" ఓ ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది.

ఇదీ చదవండి: ఐపీఎల్​ను వీడేందుకు సిద్ధమైన వార్నర్​, స్మిత్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.