మహేంద్రసింగ్ ధోనీ(dhoni age).. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు.. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌లోనూ అతడు కొనసాగేది అనుమానంగానే ఉంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో సారథ్యం వదిలేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విరాట్ కోహ్లీకి(kohli ipl runs) రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా కూడా ఇదే చివరి సీజన్. ఈ నేపథ్యంలో కెప్టెన్లుగా దాదాపు చివరిసారి ధోనీ-కోహ్లీ(Dhoni vs Kohli) కలిశారు.
శుక్రవారం ఐపీఎల్‌లో చెన్నై-బెంగళూరు(csk vs rcb) మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ టాస్ సందర్భంగా ఎదురుపడడం ఆసక్తి కలిగించింది. ఈ సీజన్లో చెన్నైతో బెంగళూరు ఇప్పటికే రెండుసార్లు తలపడిన నేపథ్యంలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే తప్ప మళ్లీ ధోనీతో కోహ్లీ(Dhoni vs Kohli) టాస్‌కు వెళ్లే దృశ్యాన్ని చూసే అవకాశం అభిమానులకు ఇక లేనట్లే!
ఈ మ్యాచ్‌లో బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో చెన్నై(csk vs rcb) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 156/6 పరుగులు చేయగా, లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చెన్నై చేధించింది. ఈ మ్యాచ్ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని, ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంది.
ఇవీ చదవండి: