ఐపీఎల్లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో నేడు జరగనున్న రెండో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ ఐపీఎల్లో ఇరుజట్లు ఆడిన 6 మ్యాచ్‌ల్లో.. దిల్లీ 4, కోల్‌కతా 2 విజయాలు సాధించాయి. పాయింట్ల పట్టికలో దిల్లీ మూడు, కోల్‌కతా ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి.
తుదిజట్లు:
కోల్‌కతా నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), ఆండ్రూ రస్సెల్, దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, శివమ్ మావి, ప్రసిద్ద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.
దిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మేయిర్, ఆక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవేశ్ ఖాన్.
ఇదీ చూడండి.. దిల్లీ బ్యాట్స్‌మెన్.. కోల్‌కతా బౌలర్ల మధ్యే పోరు!