ETV Bharat / sports

IPL 2021: బాల్‌బాయ్‌గా ఆరంభించి.. ఆర్సీబీ ఆటగాడిగా ఎదిగి - ks bharat stats

జీవితం(rcb player ks bharat) ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది. కానీ, ఐపీఎల్‌ చాలా మందికి చాలా అవకాశాలిచ్చింది. సద్వినియోగం చేసుకున్నవాళ్లు హీరోలయ్యారు. రాత్రికి రాత్రే స్టార్లుగా మారారు. అలాంటి కోవలోకే వస్తాడు మన తెలుగు తేజం కేఎస్‌ భరత్‌. విశాఖపట్నంలో టీమ్‌ఇండియా మ్యాచ్‌లకు బాల్‌బాయ్‌గా సేవలందించిన అతడు.. ఇప్పుడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో కీలక ఆటగాడిగా మారాడు. తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు..

ks bharat
కేఎస్‌ భరత్‌
author img

By

Published : Oct 10, 2021, 11:09 AM IST

విశాఖపట్నంలో(rcb player ks bharat) టీమ్‌ఇండియా మ్యాచ్‌లకు బాల్‌బాయ్‌గా సేవలందించిన తెలుగు తేజం కేఎస్‌ భరత్‌.. ఇప్పుడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో(ks bharat stats) కీలక ఆటగాడిగా మారాడు. ఇటీవల దిల్లీ క్యాపిటల్స్‌తో(IPL 2021) ఆడిన చివరి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి అందరీ దృష్టిని ఆకర్షించాడు. అతడి గురించి కొన్ని ప్రత్యేక విశేషాలు..

ks bharat
కేఎస్‌ భరత్‌

అతడేం టీ20 క్రికెటర్‌ కాదు..

భరత్‌(rcb player ks bharat) ఈ ఐపీఎల్‌కు ముందు అసలు టీ20 క్రికెటర్‌గా కనిపించలేదు. అందుకు కారణం అతడి గణాంకాలే. ఈ సీజన్‌కు ముందు మొత్తం 48 పొట్టి మ్యాచ్‌లు ఆడిన భరత్‌ 106.10 స్ట్రైక్‌రేట్‌తో 17.80 సగటుతో 730 పరుగులే చేశాడు. ఒక టీ20 క్రికెటర్‌కు ఈ గణాంకాలు అసలు సరితూగవు. కానీ, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ipl team royal challengers bangalore 2021) అతడిపై నమ్మకం ఉంచింది. గత రెండేళ్లలో అతడి ఆటతీరులోని మార్పులు గమనించింది. ఈ సీజన్‌ వేలంలో రూ.20లక్షల కనీస ధరకు కొనుగోలు చేసి యూఏఈలో అవకాశం ఇచ్చింది. ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా భరత్‌ అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడు. జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. దిల్లీతో ఆడిన మ్యాచ్‌లో చివరి బంతికి సిక్సర్‌ సాధించి జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఇక ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడి.. 45.50 సగటుతో 182 పరుగులు సాధించాడు. చివరి మ్యాచ్‌లో దిల్లీపై 78 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు.

ks bharat
కేఎస్‌ భరత్‌

అడిగి తెలుసుకోడు.. చూసే నేర్చుకుంటాడు..

భరత్‌(ks bharat stats) ఏదైనా నేర్చుకోవాలంటే సీనియర్లను అడిగి తెలుసుకోడు. వాళ్లెలా ఆడుతున్నారో దగ్గరుండి గమనిస్తాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. దిల్లీతో మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన భరత్‌.. ఏదైనా తాను నేర్చుకోవాలంటే మైదానంలో ఇతరులు ఏం చేస్తున్నారు, ఎలా ఆడుతున్నారు, ఎలా సాధన చేస్తున్నారనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తానని చెప్పాడు. "నేను పరిస్థితులకు తగ్గట్టు ఆడతా. జట్టును విజయతీరాలకు చేర్చడమే నా లక్ష్యం. ఎక్కడ ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నానని ఆలోచించను. నా స్ట్రైక్‌రేట్‌ ఎలా ఉందనే గణాంకాలు కూడా పట్టించుకోను. కొన్నిసార్లు నా స్ట్రైక్‌రేట్‌ ఆశించినంత మేర ఉండదు. కానీ, బ్యాటింగ్‌ చేసేటప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకొని ఆడతా. జట్టును విజయతీరాలకు చేర్చడమే నాకు ముఖ్యం. అలా విజయాలు సాధిస్తున్నన్ని రోజులు ఈ గణాంకాలు, బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఏవీ నాకు ప్రాధాన్యం కావు. నేను టీమ్‌ఇండియాతోనూ(teamindia) కలిసి ప్రయాణం చేశా. సీనియర్లు మైదానంలో ఎలా ఆడుతున్నారు. ఎలాంటి దృక్పథంతో ఉన్నారనే విషయాలు దగ్గరుండి చూశా. ఏదైనా అలాగే నేర్చుకుంటా" అని ఈ యువ సంచలనం వివరించాడు.

ks bharat
కేఎస్‌ భరత్‌

బాల్‌బాయ్‌గా ఆరంభించి.. బెంగళూరు ఆటగాడిగా ఎదిగి..

భరత్‌(ks bharat hometown) పుట్టి పెరిగింది విశాఖపట్నంలో. చిన్నప్పుడే తండ్రి శ్రీనివాసరావు స్థానిక క్రికెట్‌ అసోసియేషన్‌లో బాల్‌బాయ్‌గా చేర్పించారు. అక్కడ కృష్ణారావు అనే కోచ్‌ భరత్‌లోని ప్రతిభను గుర్తించి వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దాడు. దీంతో అండర్‌-13, అండర్‌-19 స్థాయిలో ఆంధ్రా క్రికెట్‌ జట్టులో పాల్గొన్నాడు. అలా 2012లో కేరళపై ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అరంగేట్రం చేసిన అతడు తర్వాత లిస్ట్‌-ఏ క్రికెటర్‌గా మారాడు. ఈ క్రమంలోనే 2015 రంజీ ట్రోఫీలో ఒక మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీ బాది.. ఈ ఘనత సాధించిన తొలి వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా రికార్డలకెక్కాడు. దీంతో అదే ఏడాది ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌ డెవిల్స్‌ (ప్రస్తుత దిల్లీ క్యాపిటల్స్‌) భరత్‌ను రూ.10లక్షలకు కొనుగోలు చేసింది. కానీ అవకాశం ఇవ్వలేదు. ఆపై మళ్లీ ఇన్నాళ్లకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అతడిలోని ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చింది. దీన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్న భరత్‌ ఒక్క మ్యాచ్‌తో స్టార్‌గా ఎదిగాడు.

ks bharat
కేఎస్‌ భరత్‌

ఇదీ చూడండి: విజయమంటే వైఫల్యాల నుంచి నేర్చుకోవడమే: అభినవ్​ బింద్రా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.