ఐపీఎల్లో శనివారం ఓ రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ముంబయి వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్లో దిల్లీ జట్టుకు పంత్ కెప్టెన్సీ వహించనున్నాడు. క్రికెట్లో తన గురువుగా చెప్పుకునే ధోనీ జట్టుపై పంత్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడనున్నాడు. మరి ఇందులో గురువు పైచేయి సాధిస్తాడా? శిష్యుడిగా గెలుస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో గతేడాది ఫైనల్ వరకు వెళ్లిన దిల్లీ.. కొద్దిలో కప్పు మిస్సయింది. ఈసారి ఎలాగైనా ట్రోఫీ సాధించాలని కసితో క్యాపిటల్స్ ఉంది. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన చెన్నై.. ప్రస్తుత సీజన్లో దానిని అధిగమించాలని చూస్తోంది.
దిల్లీ క్యాపిటల్స్ జట్టులో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. కెప్టెన్ పంత్‌తో పాటు బ్యాట్స్‌మెన్ అందరూ ఫామ్‌లో ఉన్నారు. ఇషాంత్, రబాడా, ఉమేశ్, వోక్స్, అన్రిచ్ లాంటి పేసర్లతో బౌలింగ్ కూడా బలంగా ఉంది.
చెన్నై సూపర్‌కింగ్స్‌లోకి రైనా తిరిగి రావడం సహా కెప్టెన్ ధోనీ, ఇతర ఆటగాళ్లు తొలి మ్యాచ్ కోసం పూర్తి ఉత్సాహంగా ఉన్నారు. మరి దిల్లీపై పైచేయి సాధిస్తారో లేదో చూడాలి.
జట్లు(అంచనా):
దిల్లీ క్యాపిటల్స్: పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, పృథ్వీషా, అజింక్య రహానె, హెట్మెయిర్, స్టోయినిస్, వోక్స్, అశ్విన్, అమిత్ మిశ్రా, రబాడా, ఇషాంత్ శర్మ
చెన్నై సూపర్‌కింగ్స్: ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), సురేశ్ రైనా, అంబటి రాయుడు, దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో, డుప్లెసిస్, జగదీశన్, ఎంగిడి, జడేజా, శార్దూల్ ఠాకూర్, సామ్ కరన్.
ఇదీ చూడండి: ఐపీఎల్ 2021: అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరులు!