ETV Bharat / sports

ముంబయిxపంజాబ్: కెప్టెన్లు ఏమన్నారంటే?

ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించింది పంజాబ్ కింగ్స్. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన ఇరుజట్ల కెప్టెన్లు వారి అనుభవాలను పంచుకున్నారు.

rohit ,arhul
రోహిత్,రాహుల్
author img

By

Published : Apr 24, 2021, 9:53 AM IST

పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ఓటమి చవిచూసింది ముంబయి ఇండియన్స్. 9 వికెట్ల తేడాతో గెలిచి సత్తాచాటింది పంజాబ్. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్లు వారి అనుభవాలను పంచకున్నారు. బ్యాటింగ్​లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని తెలిపాడు రోహిత్. అలాగే ఇదే ప్రదర్శనను ఇకపై కూడా కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు రాహుల్.

"మా జట్టు సరైన పరుగులు చేయలేదు. ఈ పిచ్​పై రన్స్ చేయడం అంత కష్టమేమీ కాదని నా అభిప్రాయం. పంజాబ్​ అత్యుత్తమంగా బ్యాటింగ్ చేసి 9 వికెట్ల తేడాతో గెలవడమే అందుకు నిదర్శనం. అదే పట్టుదల మా బ్యాట్స్​మెన్​లో లోపించింది. ఈ పిచ్​పై 150-160 పరగులు చేస్తే విజయం సాధించవచ్చు. చివరి రెండు మ్యాచ్​ల్లో ఇక్కడే విఫలమయ్యాం. జట్టు ప్రణాళికల్లో భాగంగానే ఇషాన్ కిషన్ రెండో స్థానంలో బరిలో దిగాడు. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. కొన్నిసార్లు అనుకూల నిర్ణయాలు రాకపోవచ్చు. కానీ ఆ నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండాలి."

-రోహిత్ శర్మ, ముంబయి కెప్టెన్

అలాగే వరుస ఓటముల తర్వాత విజయంపై స్పందించిన పంజాబ్ కెప్టెన్ రాహుల్.. ఇదే ప్రదర్శనను కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు."పిచ్ కాస్త స్లోగా ఉన్నట్లు అనిపించింది. గేల్​కు ఏ బౌలర్​ను టార్గెట్ చేయాలో బాగా తెలుసు. టీ20లో ఎంతో అనుభవం గల అతడు మా జట్టుకు విలువైన అటగాడు. రవి బిష్ణోయ్ ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేశాడు. హుడా, షారుఖ్ చాలా బాగా ఆడుతున్నారు. వారిపై మేం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టారు. ఈ మ్యాచ్​ను సరైన రీతిలో ముగించడం సంతృప్తినిచ్చింది" అని తెలిపాడు రాహుల్.

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 131 పరుగులు మాత్రమ చేయగలిగింది. రోహిత్ (63) అర్ధశతకంతో అలరించాడు. సూర్య కుమార్ 33 పరుగులతో అతడికి మద్దతుగా నిలిచాడు. మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత కేవలం 1 వికెట్ కోల్పోయి 17.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది పంజాబ్. రాహుల్ (60*) అర్ధశతకం చేయగా గేల్ (43*) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.