ETV Bharat / sports

IPL 2021: 'బ్యాట్స్​మెన్​ పరుగులు చేయకపోతే గెలవలేం' - రోహిత్ శర్మ

బ్యాట్స్​మెన్​ పరుగులు చేయకపోతే మ్యాచ్​లు గెలవడం కఠినంగా మారుతుందని అన్నాడు ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్ శర్మ. ఈ ఐపీఎల్​లో (IPL 2021) తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదని దిల్లీతో (MI vs DC) ఓటమి అనంతరం వ్యాఖ్యానించాడు.

MI vs DC
రోహిత్ శర్మ
author img

By

Published : Oct 3, 2021, 5:40 AM IST

ఐపీఎల్​లో (IPL 2021) తమ సామర్థ్యం మేరకు ఆడటం లేదని అన్నాడు ముంబయి ఇండియన్స్​ కెప్టెన్ రోహిత్ శర్మ. దిల్లీతో (MI vs DC) శనివారం మ్యాచ్​లో ఓటమి అనంతరం ఈ మేరకు వ్యాఖ్యానించాడు.

"బ్యాట్స్​మెన్​ పరుగులు చేయకపోతే మ్యాచ్​లు గెలవడం చాలా కష్టం. ఇది నాకూ వర్తిస్తుంది. మిడిల్​ ఆర్డర్​లో విఫలమయ్యాం. అది చాలా నిరాశ కలిగిస్తోంది. మా సామర్థ్యం మేరకు ఆడటం లేదు. మిగిలిన రెండు మ్యాచుల్లో మా స్థాయికి తగిన ప్రదర్శన చేస్తాం."

- రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్

షార్జా కఠినమైన వేదిక అని, అక్కడ పరుగులు చేయడం సులువు కాదని (IPL News) రోహిత్ అన్నాడు. పిచ్​ స్వభావం తెలిసే బరిలోకి దిగినా.. భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైనట్లు చెప్పాడు.

చాలా కష్టపడ్డాం..

ఇది ఎంతో కష్టపడితే వచ్చిన విజయమని మ్యాచ్​ అనంతరం వ్యాఖ్యానించాడు దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant). "షార్జాలో వికెట్​ భిన్నంగా ఉంటుంది. ఈ సీజన్​లో మాకు దొరికిన అత్యుత్తమ క్రికెటర్ అవేశ్. మేము (దిల్లీ క్యాపిటల్స్) మా తప్పిదాల నుంచి నేర్చుకొని, ముందుకెళ్తాం. మా బ్యాటింగ్​ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది." అని పంత్ అన్నాడు.

ముంబయికి కష్టమే..!

4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన ముంబయికి ప్లే ఆఫ్ (IPL 2021 Playoffs) చేరడం సంక్లిష్టంగా మారింది. ముంబయి ప్లే ఆఫ్స్​ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్​లు తప్పక గెలవడం సహా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: MI vs DC: ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం- ముంబయి అవకాశాలు సంక్లిష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.