ETV Bharat / sports

కరోనా ఉన్నా.. దిల్లీ మ్యాచ్​లు అక్కడే! - IPL will be held in Delhi as per schedule

దిల్లీలో కరోనా ఉద్ధృతి భీకర స్థాయిలో ఉన్నా.. అక్కడి నుంచి ఐపీఎల్ మ్యాచ్​లు తరలించే అవకాశం కనిపించడం లేదు. బయోబబుల్​ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయని, షెడ్యూల్​ ప్రకారమే మ్యాచ్​లు జరుగుతాయని దిల్లీ క్రికెట్ సంఘం తెలిపింది.

IPL will be held in Delhi as per schedule
దిల్లీలో ఐపీఎల్ మ్యాచ్​లు
author img

By

Published : Apr 25, 2021, 7:55 AM IST

దిల్లీలో కరోనా తీవ్రంగా ఉన్నా అక్కడి నుంచి ఐపీఎల్​ మ్యాచ్​లను తరలించే ఉద్దేశంతో బీసీసీఐ లేదు. నాలుగు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు చెన్నై, హైదరాబాద్​, రాజస్థాన్, ముంబయి... దిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఈ నెల 28 నుంచి మే 8 వరకు ఎనిమిది మ్యాచ్​లు​ ఆడాల్సిఉంది. 26వ తేదీ వరకు జట్లన్నీ ఇక్కడికి చేరుకుంటాయి.

"షెడ్యూల్​ ప్రకారమే దిల్లీలో ఐపీఎల్ జరుగుతుంది" అని దిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ చెప్పాడు. "బయోబబుల్​కు ఎలాంటి ముప్పూ లేదు. నేను బబుల్​లో భాగం కాకుంటే అందులో ఉండే వాళ్లెవరినీ నేను కలవలేను. బబుల్​ చాలా సురక్షితం" అని అన్నాడు. గ్రౌండ్స్​మెన్ సహా మ్యాచ్​ల నిర్వహణకు సంబంధించిన వాళ్లంతా బబుల్​లో ఉన్నారని తెలిపాడు.

ఇదీ చూడండి: 'బుమ్రా కంటే సిరాజే ముందుంటాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.