ETV Bharat / sports

ఐపీఎల్: ధోనీని అధిగమించిన రోహిత్ శర్మ - ఐపీఎల్ లేటేస్ట్ రికార్డు

ఐపీఎల్​లో ఎక్కువ సిక్సులు కొట్టిన భారత క్రికెటర్​గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో ధోనీని అధిగమించాడు. సన్​రైజర్స్ హైదరాబాద్​తో మ్యాచ్​లో ఈ ఘనత సాధించాడు.

IPL: Rohit Sharma leapfrogs MS Dhoni to record most sixes by Indian
ఐపీఎల్: ధోనీని అధిగమించిన రోహిత్ శర్మ
author img

By

Published : Apr 18, 2021, 9:41 AM IST

Updated : Apr 18, 2021, 9:48 AM IST

మహేంద్ర సింగ్​ ధోనీని అధిగమించిన రోహిత్ శర్మ.. ఐపీఎల్​లో మరో ఘనత సాధించాడు. సన్​రైజర్స్ హైదరాబాద్​తో శనివారం జరిగిన మ్యాచ్​లో ఈ మార్క్​ను అందుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ 217 సిక్సులతో ఉండగా, అతడి వెనుక ధోనీ 216 సిక్సులతో ఉన్నాడు.

విధ్వంసక క్రిస్​ గేల్.. ఈ లీగ్​లో అందరి కంటే ఎక్కువ సిక్సులు కొట్టిన బ్యాట్స్​మన్​గా కొనసాగుతున్నాడు. ఇతడి ఖాతాలో 350 ప్లస్ సిక్సులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఏబీ డివిలియర్స్ (237) ఉన్నాడు.

అలానే కెప్టెన్​గానూ 4000 పరుగులు పూర్తి చేశాడు రోహిత్ శర్మ. మొత్తంగా లీగ్​లో 5324 రన్స్​తో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇది చదవండి: ఐపీఎల్​: సన్​రైజర్స్​పై ముంబయి విజయం

Last Updated : Apr 18, 2021, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.