ETV Bharat / sports

'వరుసగా 4మ్యాచులు ఆడలేకపోతే ఇంకెందుకు?'.. దీపక్​పై రవిశాస్త్రి సీరియస్!​ - దీపక్​ చాహర్ లేటెస్ట్ అప్డేట్స్

టీమ్​ఇండియా ప్లేయర్లు తరచూ గాయపడుతున్న విషయంపై మాజీ క్రికెట్​ కోచ్ రవి శాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఆడలేకపోతే ఎలా అంటూ మండిపడ్డాడు. ఐపీఎల్​లో చెన్నై టీమ్​ పేసర్ దీపక్ చాహర్ పదే పదే గాయాలపాలవుతుండటంపై శాస్త్రి ఏమన్నాడంటే?

ravi shastry about deepak chahar
ravi shastry about deepak chahar
author img

By

Published : Apr 12, 2023, 7:14 PM IST

క్రికెట్​లో గాయాలనేటివి ఎలాంటి జట్టునైనా బలహీన పరిచేలా చేస్తాయి. టీమ్​ఇండియా కూడా గత కొద్ది కాలంగా ఈ గాయాల రుచి చూస్తూనే వస్తోంది. ముఖ్యంగా పేస్ బౌలర్లు తరచూ గాయాల వల్ల కీలకమైన సిరీస్​లకు దూరమౌతున్నారు. ఈ క్రమంలో దీపక్ చాహర్ తరచూ టీమ్​లోకి వస్తూ.. వెనువెంటనే గాయాల బారినపడుతున్నాడు. తాజాగా ఈ విషయంపై మాజీ కోచ్​ రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న దీపక్​.. ముంబయితో జరిగిన మ్యాచ్​లో గాయపడ్డాడు. దీంతో బుధవారం జరగనున్న రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్​కు దూరం కానున్నాడని సమాచారం. ఈ గాయాలపై మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా మండిపడ్డాడు. చెన్నై టీమ్​లో ఇప్పటికే కైల్ జేమీసన్, ముకేశ్​ చౌదరి లాంటి స్టార్స్​ గాయాలతోనే మ్యాచ్​లకు దూరమయ్యారు. ఇదే తరహాలో చాహర్ కూడా చెన్నై టీమ్​కు అందుబాటు లేకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. దీపక్​ చాహర్​ తరచూ గాయాల పాలవ్వడం పట్ల శాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా కొందరు క్రికెటర్లు నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ)కు శాశ్వత సభ్యులు అయిపోయారంటూ రవిశాస్త్రి సెటైర్లు వేశాడు. "కొందరు ప్లేయర్స్ ఎన్సీఏలో శాశ్వత సభ్యులు అవుతున్నారు. త్వరలోనే వారికి అక్కడ నివాస అనుమతి కూడా వస్తుందేమో" అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు.

"ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడికి వెళ్లొచ్చు. ఇది సరైన విషయం కాదు. ఇలా పదే పదే గాయపడటానికి మరీ అంతగా క్రికెట్ ఆడటం లేదు. వరుసగా నాలుగు మ్యాచ్​లు కూడా ఆడలేకపోతే ఎలా. ఎన్సీఏకు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు తిరిగి వస్తున్నారు? మూడు మ్యాచ్​లు ఆడి మళ్లీ అక్కడికే వెళ్తున్నారు" అని రవిశాస్త్రి అన్నాడు. మ్యాచ్​కు కావాల్సిన కీలకమైన ఆటగాళ్లు ఇలా తరచూ గాయాలపాలవుతుంటే ఆయా జట్లకు, కెప్టెన్లకు, బీసీసీఐకి చిరాకు తెప్పిస్తుందని శాస్త్రి చెప్పాడు.

"ఇది టీమ్​కే కాకుండా ప్లేయర్లకు, కెప్టెన్లకు, అలాగే బీసీసీఐ, ఫ్రాంఛైజీలకు కూడా చికాకు తెప్పిస్తుంది. తీవ్రమైన గాయం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి నాలుగో మ్యాచ్​లో ఓ ప్లేయర్ కాలి పిక్కల్లోనో, గజ్జల్లోనో గాయపడితే అసలు ఏం జరుగుతుందో అనే విషయం కాస్త గట్టిగా ఆలోచించాల్సిందే. కేవలం నాలుగు ఓవర్లు, మూడు గంటల్లోనే మ్యాచ్ ముగుస్తుంది. ఇది మరీ దారుణంగా ఉంది" అని రవిశాస్త్రి అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.