ETV Bharat / sports

ఈ మ్యాచ్​తోనైనా సన్​రైజర్స్​ లక్ మారేనా? - ఎస్‌ఆర్‌హెచ్ vs ఎంఐ మ్యాచ్ ప్రిడిక్షన్

ముంబయి ఇండియన్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్ మధ్య మంగళవారం మ్యాచ్ జరగనుంది. దిల్లీలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

sunrisers mumbai
సన్​రైజర్స్​ ముంబయి
author img

By

Published : May 4, 2021, 5:27 AM IST

గత రెండు మ్యాచ్​ల నుంచి ఫామ్​లోకి వచ్చిన ముంబయి ఇండియన్స్​తో తలపడేందుకు సన్​రైజర్స్​ హైదరాబాద్ సిద్ధమైంది​. పాయింట్ల పట్టికల్లో ముందుకు దూసుకెళ్లాలని రోహిత్​​.. ఈ సారైనా విజయం సాధించి, సక్సెస్ ట్రాక్​లోకి రావాలని విలియమ్సన్ పట్టుదలతో ఉన్నాడు. ఇరుజట్లు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.

ముంబయి జోరు కొనసాగించేనా?

టైటిల్​ ఫేవరెట్లలో ఒకటైన ముంబయి..​ ఈ సీజన్​లో గతఫామ్​ను చూపలేక సతమతమవుతోంది. ఓటమితో సీజన్​ను ప్రారంభించిన రోహిత్ సేన.. ఆడిన ఏడు మ్యాచ్​ల్లో నాలుగింటిలో విజయం సాధించింది. అయితే గత రెండు మ్యాచ్​ల విజయాలు సాధించింది. ఇప్పుడు సన్​రైజర్స్​ను ఓడించి పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లాలని పట్టుదలతో ఉంది. డికాక్​,​ పొలార్డ్​, రోహిత్​తో బ్యాటింగ్ దళం బలంగా ఉంది.

బుమ్రా, బౌల్ట్​, రాహుల్ చాహర్, కౌల్టర్​ నైల్ బౌలింగ్​ దళం బలంగా ఉన్నప్పటికీ వారు ఇంకా మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. ఆల్​రౌండర్లు కృనాల్, హార్దిక్​ పాండ్య ఇంకాస్త మంచి ప్రదర్శన చేయాలి. మొత్తంగా జట్టు సమష్టిగా రాణిస్తే ముంబయి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడం ఖాయం.

ఈ సారైనా గెలుస్తుందా?

సన్​రైజర్స్​ హైదరాబాద్​.. ఈ సీజన్​లో అత్యంత దారుణంగా ఓటములను ఖాతాలో వేసుకుని విమర్శలను ఎదుర్కొంటోంది. ప్లేఆఫ్స్​ అవకాశాలను ఇప్పటికే దాదాపు పోగొట్టుకుంది!. ఆడిన ఏడింటిలో ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. రాజస్థాన్​​​తో గత మ్యాచ్​లో నూతన సారథి విలియమ్సన్​తో బరిలో దిగినా రాత మారలేదు. మనీశ్​ పాండే, బెయిర్​ స్టో మినహా ఎవరూ రాణించలేకపోయారు. బౌలర్లు రషీద్​ ఖాన్​, విజయ్​ శంకర్​, భువి, నబీ నామమాత్రపు ప్రదర్శన చేశారు. ముంబయితే జరగబోయే మ్యాచ్​లో మాజీ సారథి వార్నర్​ దాదాపుగా ఉండకపోవచ్చు. కాబట్టి జట్టు సమస్యలను సరిచేసుకుని బరిలో దిగితే తప్ప విజయాన్ని అందుకోవడం కష్టం. మరి ఏమి చేస్తుందో చూడాలి.

జట్లు (అంచనా)

హైదరాబాద్​: బెయిర్​ స్టో, విలియమ్సన్​, మనీశ్​ పాండే, అబ్దుల్​ సమద్​, మహ్మద్​ నబీ, కేదర్​ జాదవ్​, విజయ శంకర్​, రషీద్​ ఖాన్​, సందీప్​ శర్మ, ఖలీల్​ అహ్మద్​, భువనేశ్వర్​ కుమార్​

ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్, పొలార్డ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, నీషమ్, రాహుల్ చాహర్, ధావల్ కులకర్ణి, బుమ్రా, బౌల్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.