ETV Bharat / sports

'ఐపీఎల్​ నిరవధిక వాయిదాను అర్థం చేసుకోగలం'

ఐపీఎల్​ నిరవధిక వాయిదాపై క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్​ అసోసియేషన్​ స్పందించాయి. లీగ్​ను అర్ధాంతరంగా వాయిదా వేయడాన్ని అర్థం చేసుకోగలమని పేర్కొన్నాయి.

cricket australia, IPL postponed amid widening COVID-19 outbreak
క్రికెట్ ఆస్ట్రేలియా, ఐపీఎల్​ వాయిదా వేయడాన్ని అర్థం చేసుకోగలం
author img

By

Published : May 5, 2021, 8:21 AM IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐపీఎల్‌ 14వ సీజన్‌ అర్ధాంతరంగా వాయిదా పడిన నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే భారత్‌ నుంచే వచ్చే ప్రయాణికుల విమానాలపై అక్కడి ప్రభుత్వం మే 15 వరకు తాత్కాలికంగా నిషేధం విధించింది. దాంతో ఐపీఎల్‌లో ఆడుతున్న కంగారూ క్రికెటర్లు ఇప్పుడు తిరిగి ఇళ్లకు చేరుకునే విషయంపై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ విషయంపై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ), ఆస్ట్రేలియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌(ఏసీఏ) మంగళవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

"మే 15 వరకు భారత్‌ నుంచి వచ్చే విమానాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన విషయాన్ని మేం గౌరవిస్తున్నాం. అందులో మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరలేము. అయితే.. ఆస్ట్రేలియా క్రికెటర్లు, వ్యాఖ్యాతలు, కోచ్‌లు, ఇతర సిబ్బంది తిరిగి క్షేమంగా ఇక్కడికి వచ్చే విషయంపై బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఆ బోర్డుతో క్రికెట్‌ ఆస్ట్రేలియా నేరుగా సంప్రదింపులు జరుపుతోంది. అందుకు బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పాలి. ఇక్కడి ఆటగాళ్లను క్షేమంగా స్వదేశానికి చేర్చేలా కష్టపడుతోంది. అలాగే ఐపీఎల్‌ 14వ సీజన్‌ను ఇలా నిరవధికంగా వాయిదా వేయడాన్ని మేం అర్థం చేసుకోగలం" అని సీఏ, ఏసీఏ అందులో పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: మారడోనాకు సరైన చికిత్స అంది ఉంటే!

మరోవైపు విదేశీ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది తిరిగి వారి స్వస్థలాలకు క్షేమంగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఐపీఎల్ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ మంగళవారం ఓ క్రీడా ఛానెల్​తో అన్నారు. ఇక అంతకుముందు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన వెంటనే ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు స్వదేశం చేరుకున్నారు.

ఇదీ చదవండి: ఐపీఎల్​ ఖతం.. సందిగ్ధంలో టీ20 ప్రపంచకప్​ ఆతిథ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.