ETV Bharat / sports

ఐపీఎల్​ ఫైనల్​ వేదిక ఖరారు.. ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​ - ఐపీఎల్​ ఫ్యాన్స్​

IPL Audience: ఐపీఎల్​ అభిమానులకు గుడ్​న్యూస్​. స్టేడియం సీటింగ్‌ సామర్థ్యంలో 100 శాతం మంది ప్రేక్షకులకు అనుమతిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఇప్పుడు కాదు.. మే 24 నుంచి జరగనున్న నాకౌట్​ మ్యాచులకు వంద శాతం మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు.

IPL Audience
IPL Audience
author img

By

Published : Apr 23, 2022, 9:50 PM IST

IPL Audience: ఐపీఎల్​ 15వ సీజన్​ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే సగం మ్యాచులు పూర్తయ్యాయి. ఏటా లీగ్​లో అదరగొట్టే డిఫెండింగ్ ఛాంపియన్​ చెన్నై సూపర్ కింగ్స్​, అత్యధిక సార్లు టైటిల్​ విజేత ముంబయి ఇండియన్స్​ జట్లు ఈ సీజన్​లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అడుగున ఉన్నాయి. ఇక, అభిమానుల విషయానికొస్తే ప్రస్తుతం.. స్టేడియాలకు కొవిడ్​ నిబంధనల దృష్ట్యా కేవలం 25 శాతం మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. తాజాగా శనివారం బీసీసీఐ బోర్డు అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం అనంతరం అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ.. క్రికెట్​​ అభిమానులకు గుడ్​న్యూస్​ చెప్పారు.

"పురుషుల ఐపీఎల్ 15 సీజన్​ నాకౌట్​ దశ మ్యాచ్​లు కోల్​కతా, అహ్మదాబాద్​ నగరాల్లో నిర్వహిస్తాం. ఆ మ్యాచ్​లను వంద శాతం ప్రేక్షకుల సామర్థ్యంతో జరుగుతాయి. మే 24,26 తేదీల్లో కోల్‌కతాలో మొదటి ప్లే-ఆఫ్ ,ఎలిమినేటర్ మ్యాచ్​లు జరగనున్నాయి. మే 27, 29 తేదీల్లో అహ్మదాబాద్‌లో రెండో ప్లే-ఆఫ్, ఫైనల్ మ్యాచ్​లు జరగనున్నాయి" అని గంగూలీ తెలిపారు. మే 24 నుంచి 28 వరకు లఖ్​నవూలోని ఎకానా స్టేడియంలో మూడు జట్ల మహిళల ఛాలెంజర్‌ సిరీస్​ను కూడా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు జూన్‌లో దక్షిణాఫ్రికాతో.. టీమ్​ఇండియా ఆడనున్న ఐదు మ్యాచ్​ల టీ-20 సిరీస్‌ వేదికలను బీసీసీఐ ప్రకటించింది. జూన్​ 9న దిల్లీ వేదికగా తొలి టీ-20 జరగనుండగా.. జూన్​ 19న చివరి మ్యాచ్​ ఆడనుంది. 14న జరగనున్న మూడో టీ-20కి వైజాగ్​ వేదిక. మిగతా మూడు మ్యాచ్​లకు కటక్​, రాజ్​కోట్​, బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఇవీ చదవండి: ధర రూ.10 కోట్లకుపైనే.. అంచనాలు అందుకోలేక..!

గుజరాత్​ బౌలర్లు భళా.. ఉత్కంఠ పోరులో కేకేఆర్​పై​ విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.