ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై వేదికగా శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుతో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. వరుసగా మూడు పరాజయాలతో పంజాబ్ ఉండగా.. టోర్నీలో నిలకడ కోసం ముంబయి ఇండియన్స్ ప్రయత్నిస్తుంది. ఇప్పటివరకు టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన రెండు విజయాలను నమోదు చేసుకుంది. పంజాబ్.. ఒకే గెలుపుతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరుకుంది.
మిడిల్ ఆర్డర్‌పై దృష్టి..
దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమై పరాజయాన్ని చవిచూసింది ముంబయి ఇండియన్స్. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నా.. మిడిల్ ఆర్డర్లో నిలకడ లేకపోవడం వల్ల జట్టు అతితక్కువ స్కోరుకే పరిమితమవుతోంది. అయితే పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రదర్శన చేయాలని రోహిత్‌సేన వ్యూహాలను రచిస్తోంది. అలాగే, ముంబయి బౌలింగ్ దళం బలంగానే ఉంది.
హాట్రిక్ ఓటముల తర్వాత..
బుధవారం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది పంజాబ్. అయితే ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఓటమికి కారణం.. చెపాక్ పిచ్‌ను అర్థం చేసుకోవడమేనని పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటి సమస్యలను అధిగమిస్తామని స్పష్టం చేశాడు.
టీమ్‌లోని విండీస్ ఆటగాళ్లు క్రిస్ గేల్, నికోలస్ పూరన్‌లు బ్యాటింగ్‌లో రాణించకపోవడం పంజాబ్ జట్టుపై ప్రభావం చూపిస్తుందనే చెప్పాలి. మిడిల్ ఆర్డర్లో ఉన్న వీరిద్దరూ వెంటనే పెవిలియన్ చేరడం వల్ల ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్ నిలదొక్కుకోవడం లేదు. అలాగే, ఈ మ్యాచ్‌లో మురుగన్ అశ్విన్ స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకోవడం సహా క్రిస్ జోర్డాన్‌కు తుదిజట్టులోకి ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
జట్లు(అంచనా):
ముంబయి ఇండియన్స్: క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కిరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, మొయిసెస్ హెన్రిక్స్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుక్ ఖాన్, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
ఇదీ చూడండి: ఆర్సీబీని నా కుటుంబంలా భావిస్తా: మ్యాక్స్‌వెల్