ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్‌లోనూ ప్లేయర్స్ తమ అద్భుతమైన ఆటతో అభిమానులకు మంచి కిక్‌ను ఇస్తున్నారు. మ్యాచ్ మ్యాచ్‌కు ఉత్కంఠ పెంచుతూ.. అసలు సిసలు క్రికెట్ మజాను ఇస్తున్నారు. అన్ని టీమ్ ప్లేయర్స్ మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అలా దాదాపు మ్యాచులన్నీ కూడా లాస్ట్ బాల్ వరకు సాగుతూ మస్తు థ్రిల్లింగ్‌ను ఇస్తున్నాయి. దీంతో ఆయా ప్లేయర్ల అద్భుత ప్రదర్శన చూసి.. వారి అభిమానులు కూడా తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ 16 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి ఓ ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 26 మ్యాచులు జరిగాయి. ఈ 26 మ్యాచుల్లోనూ.. వేర్వేరు ఆటగాళ్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకోవడం విశేషం. ఈ క్యాష్ రిచ్ లీగ్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్. గతంలో ఎప్పుడూ ఇలా ఇన్ని వరుస మ్యాచ్‌ల్లో వేర్వేరు ప్లేయర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకోలేదనే చెప్పాలి! ఇలా ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ప్లేయర్ అదరగొట్టడంతో.. క్రికిట్ లవర్స్‌కు ప్రస్తుత ఐపీఎల్ మంచి అనుభూతిని కలిగిస్తోంది. మరి ఇప్పటివరకు జరిగిన మ్యూచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విన్నర్లు ఎవరో తెలుసుకుందాం..
- సీఎస్కే-గుజరాత్ మ్యాచ్ : రషీద్ ఖాన్(గుజరాత్)
- పంజాబ్ - కేకేఆర్ : అర్షదీప్ సింగ్(పంజాబ్)
- లఖ్‌నవూ - దిల్లీ క్యాపిటల్స్ : మార్క్ వుడ్ (లఖ్‌నవూ)
- రాజస్థాన్ - సన్‌రైజర్స్ : జాస్ బట్లర్(రాజస్థాన్)
- ఆర్సీబీ - ముంబయి : డుప్లెసిస్(ఆర్సీబీ)
- సీఎస్కే - లఖ్‌నవూ : మొయిన్ అలీ (సీఎస్‌కే)
- గుజరాత్ - దిల్లీ క్యాపిటల్స్ : సాయి సుదర్శన్ (గుజరాత్)
- పంజాబ్ - రాజస్థాన్ : నాథన్ ఇల్లిస్ (పంజాబ్)
- కేకేఆర్ - ఆర్సీబీ : శార్దూల్ ఠాకూర్ (కేకేఆర్)
- లఖ్‌నవూ వర్సెస్ సన్‌రైజర్స్ : కృనాల్ పాండ్య (లఖ్‌నవూ)
- రాజస్థాన్ - దిల్లీ : యశస్వి జస్వాల్ (రాజస్థాన్)
- సీఎస్‌కే - ముంబయి : రవీంద్ర జడేజా (సీఎస్‌కే)
- కేకేఆర్ వర్సెస్ గుజరాత్: రింకూ సింగ్ (కేకేఆర్)
- సన్‌రైజర్స్‌వర్సెస్ పంజాబ్: శిఖర్ ధవన్ (పంజాబ్)
- లఖ్‌నవూ - ఆర్సీబీ : పూరన్(లఖ్‌నవూ)
- ముంబయి - దిల్లీ క్యాపిటల్స్: రోహిత్ శర్మ (ముంబయి)
- రాజస్థాన్ - సీఎస్‌కే : అశ్విన్ (రాజస్థాన్)
- గుజరాత్ - పంజాబ్ : మోహిత్ శర్మ (గుజరాత్)
- సన్‌రైజర్స్ - కేకేఆర్ : హ్యారీ బ్రూక్ (సన్‌రైజర్స్)
- ఆర్సీబీ - దిల్లీ క్యాపిటల్స్ : విరాట్ కోహ్లి (ఆర్సీబీ)
- పంజాబ్ - లఖ్‌నవూ : సికందర్ రజా (పంజాబ్)
- ముంబయి - కేకేఆర్ : వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)
- రాజస్థాన్ - గుజరాత్: షిమ్రోన్ హెట్‌మైర్ (రాజస్థాన్)
- సీఎస్‌కే - ఆర్సీబీ : డెవాన్ కాన్వే (సీఎస్‌కే)
- ముంబయి - సన్‌రైజర్స్ : కెమారూన్ గ్రీన్ (ముంబయి)
- లఖ్‌నవూ - రాజస్థాన్ : మార్కస్ స్టోయినిస్ (లఖ్‌నవూ)
ఇదీ చూడండి: IPL 2023 : అర్జున్ తెందుల్కర్ ధనాధన్ షాట్స్.. బంతులన్నీ గాల్లోకే... వీడియో చూశారా?