ETV Bharat / sports

IPL 2021 Final: అసలైనపోరులో ట్రోఫీ నెగ్గేదెవరు?

ఐపీఎల్‌-14వ సీజన్(IPL 2021 Final) ట్రోఫీ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌(CSK Vs KKR) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశల్లో అద్భుత ఆటతీరుతో ఫైనల్‌ చేరిన ఇరుజట్లు.. కీలక మ్యాచ్​కు సిద్ధమయ్యాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై(Chennai Super Kings IPL Wins).. రెండు సార్లు కప్పు ముద్దాడిన కోల్​కతా(Kolkata Knight Riders IPL Wins) జట్లు మరో టైటిల్‌ను తమఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాయి. ఇరుజట్ల మధ్య తుదిపోరు శుక్రవారం రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది.

IPL Final: KKR spinners hold aces as world awaits Dhoni 'Magic' one last time
చెన్నై వర్సెస్​ కోల్​కతా
author img

By

Published : Oct 14, 2021, 5:34 PM IST

ఐపీఎల్-14 సీజన్(IPL 2021 Final) తుది పోరుకు వేళైంది. పేలవ ప్రదర్శనతో గతేడాది లీగ్ దశలోనే నిష్క్రమించిన చెన్నై.. రెట్టించిన వేగంతో ఈ సీజన్‌లో ఫైనల్‌కు(CSK Vs KKR) దూసుకెళ్లింది. ఆటగాళ్ల సమష్టి కృషితో రెండో అంచెలో వరుస విజయాలు సాధించిన కోల్‌కతా నాకౌట్‌లో ఆర్సీబీ, దిల్లీని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌లో లీగ్‌దశలో ఆడిన 14 మ్యాచుల్లో 9 గెలిచి చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో.. టేబుల్ టాప్‌ దిల్లీని ఓడించి ఐపీఎల్​లో తొమ్మిదోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ధోనీ వ్యూహాలు ఆ జట్టుకు ప్రధాన బలం. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌లో చెలరేగి ఆడుతున్నాడు. ఈ ఏడాది 600 పైచీలుకు పరుగులు చేసి. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ధోనీ మాయ చేస్తాడా?

చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు(Chennai Super Kings IPL Wins) కూర్పు విషయంలో.. కెప్టెన్​ ధోనీ వ్యూహాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న స్టార్​ బ్యాటర్ సురేశ్‌ రైనా స్థానంలో.. ఉతప్పను తొలి క్వాలిఫయర్‌ తుదిజట్టులోకి తీసుకుని ధోనీ ఫలితం రాబట్టాడు. బ్రావో, డుప్లెసిస్, రాయుడు, ఉతప్ప, మొయిన్ అలీ, జడేజా వంటి సీనియర్ల అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని యాజమాన్యం భావిస్తోంది. జోష్ హెజిల్‌వుడ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లతో కూడిన బౌలింగ్ దళం కూడా బలంగా కనిపిస్తోంది. ఐతే.. కోల్​కతా స్పిన్ త్రయం వరుణ్ చక్రవర్తి, షకిబ్, సునీల్ నరైన్‌ను ఎలా ఎదుర్కొంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

ముచ్చటగా మూడోసారి..

ఇప్పటివరకు ఐపీఎల్‌లో 8సార్లు ఫైనల్‌కు చేరుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదుసార్లు ఓడిపోగా.. కోల్​కతా నైట్​రైడర్స్​ మాత్రం ఫైనల్‌కు(Kolkata Knight Riders IPL Wins) చేరిన రెండుసార్లు కప్‌ నెగ్గింది. ఈ సీజన్‌లో భాగంగా భారత్‌లో జరిగిన తొలి అంచెలో ఆడిన 7 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచిన కోల్‌కతా రెండోఅంచెలో అందుకు పూర్తి భిన్నమైన ఫలితాలు రాబట్టింది. స్పిన్‌ త్రయం.. వరుణ్ చక్రవర్తి, షకిబ్, నరైన్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసివస్తోంది. ఓపెనర్లు.. వెంకటేశ్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ సహా మిగిలిన బ్యాటర్లు రాణిస్తుండం కలిసొచ్చే అంశం. గాయపడ్డ రసెల్​ స్థానంలో జట్టులోకి వచ్చిన షకిబ్‌ జట్టుకు సమతూకం తెస్తున్నాడు. దుబాయ్​ వేదికగా శుక్రవారం రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫైనల్‌ ఒత్తిడిని తట్టుకుని విజయదశమి రోజున ఏ జట్టు విజయం సాధిస్తుందోనని క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.

ఇదీ చూడండి.. ఐపీఎల్​ నియమావళిని ఉల్లంఘించిన దినేశ్​ కార్తిక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.