ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2023 ఎలిమినేటర్ మ్యాచులో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ను ఓడించి ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో యువ బౌలర్ ఆకాశ్ మధ్వాల్ కీలక పాత్ర పోషించాడు. కేవలం ఐదే పరుగులు సమర్పించి ఐదు వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు. దీంతో క్రికెట్ అభిమానుల దృష్టి ఈ బౌలర్‌పై పడింది. అతడెవరా అని తెగ ఆరాతీస్తున్నారు. ఇంతకీ అతడెవరంటే?
1993లో రూర్కీలో జన్మించాడు ఆకాశ్ సివిల్. ఇంజినీరింగ్‌ను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. దీంతో అతడికి ఉచిత సలహాలు ఎదురయ్యాయి. అయినా అతడు వెనక్కి తగ్గలేదు. ఐదేళ్ల కిందట వరకు కేవలం టెన్నిస్ బాల్‌తోనే ఆడేవాడు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ నుంచి ఇపీఎల్లోకి అడుగు పెట్టిన తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు ఆకాశ్ మధ్వాల్. ఇక దేశవాళీ క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ వంటి బ్యాటర్‌కు బంతులేసిన ఎక్స్పీరియన్స్.
అతడి చొరవతో.. ఆకాశ్ మధ్వాల్.. పాతికేళ్ల వయసులో తొలిసారి.. 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడేందుకు తొలిసారి ఉత్తరాఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు. టీమ్ ఇండియా మాజీ ప్లేయర్, ఉత్తరా ఖండ్‌కు కోచ్‌గా పనిచేసిన జాఫర్ అతడికి అండగా నిలిచాడు. అప్పటి వరకు టెన్నిస్ బాల్‌తోనే ఆడిన ఆకాశ్.. ఫస్ట్ టైమ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కోసం రెడ్ బాల్‌ను పట్టుకున్నాడు. అలా ఆకాశ్.. తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు మధ్వాల్. దీంతో అతడికి ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది.
-
1. Akash Madhwal 🌟 pic.twitter.com/1dgZbfl0FL
— Mumbai Indians (@mipaltan) May 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">1. Akash Madhwal 🌟 pic.twitter.com/1dgZbfl0FL
— Mumbai Indians (@mipaltan) May 25, 20231. Akash Madhwal 🌟 pic.twitter.com/1dgZbfl0FL
— Mumbai Indians (@mipaltan) May 25, 2023
పంత్ గురువు దగ్గరే.. ఆకాశ్ మధ్వాల్.. టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు సహచరుడు. ఇద్దరూ ఒకే ప్రాంతం నుంచి వచ్చినవారు. పంత్‌కు శిక్షణ ఇచ్చిన అత్వార్ సింగ్ వద్దే ఆకాశ్ కూడా శిక్షణ తీసుకున్నాడు. దేశవాళీలో ఆకాశ్ తన ప్రదర్శనతో కెప్టెన్సీని దక్కించుకున్నాడు. ఉత్తరాఖండ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు.
ముంబయి చేతికి అలా.. టాలెంట్ ఉన్న ఆటగాళ్ల కోసం ఐపీఎల్ జట్టు ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటాయి. ముంబయి ఇండియన్స్ కూడా అదే చేస్తుంది. అలా ముంబయిలో కంటిలో అతడు పడ్డాడు. ఆకాశ్ మధ్వాల్ ప్రదర్శనను గుర్తించిన ముంబయి.. అతడికి అవకాశం ఇచ్చింది. గతేడాది సీజన్‌లో కేవలం రూ. 20 లక్షలకే సొంతం చేసుకుంది. కానీ అప్పడతడు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేకపోయాడు. అలానే అదే సీజన్‌లో సూర్యకుమార్ గాయపడటం వల్ల అతడి స్థానంలోనే ఆకాశ్ జట్టులోకి వచ్చాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ నెట్ బౌలర్‌గా అతడి ప్రదర్శనతో యాజమాన్యం దృష్టిలో పడ్డాడు. ఇక ఈ సీజన్‌లో బుమ్రా, ఆర్చర్ వంటి వాళ్లు దూరం కావడంతో మద్వాల్‌కు అవకాశం లభించింది. అలా ఈ సీజన్‌లోని ఏడు మ్యాచుల్లోనే 13 వికెట్లు దక్కించుకున్నాడు.
ఆకాశ్‌లో స్పెషల్ అదే.. బౌలింగ్‌లో ఆకాశ్ మధ్వాల్‌కు ఓ ప్రత్యేకత ఉంది. బంతిని తక్కువ బౌన్స్‌తో జారవిడిచేలా వేయడం అతడి శైలి. లీగ్ స్టేజ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగు వికెట్లు పడగొట్టిన ఆకాశ్.. ప్లేఆఫ్స్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అత్యంత తక్కువ ఎకానమీతో బంతులు వేసిన బౌలర్‌గా నిలిచాడు. 3.3 ఓవర్లలో కేవలం ఐదు పరుగులే సమర్పించుకుని ఐదు వికెట్లు తీశాడు.
ఇదీ చూడండి: IPL 2023 : ముంబయిని అక్కడే ఆపండి.. ఫైనల్‌కు వస్తే ఇక అంతే సంగతులు!