ETV Bharat / sports

IPL 2023: ఉప్పల్​ మ్యాచ్​లో త్రిపాఠి వీరబాదుడు.. హైదరాబాద్ బోణీ - హైదరాబాద్​ వర్సెస్​ పంజాబ్​ మ్యాచ్​

ఐపీఎల్​ 2023లో హోమ్​ టీమ్ సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు బోణీ కొట్టింది. పంజాబ్​ కింగ్స్​తో​ జరిగిన మ్యాచ్​లో.. హైదరాబాద్​ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్​ బ్యాటర్ రాహుల్​ త్రిపాఠి(74) పరుగులతో రాణించాడు.

IPL 2023 srh pkbs MATCH WINNER
IPL 2023 srh pkbs MATCH WINNER
author img

By

Published : Apr 9, 2023, 11:02 PM IST

Updated : Apr 10, 2023, 8:03 AM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు బోణీ కొట్టింది. వరుసగా తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాలను అందుకున్న సన్‌రైజర్స్‌ మూడో మ్యాచుతో ఈ సీజన్​లో ఖాతా తెరిచింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో.. రెండిటిలో అద్భుత ప్రదర్శన చేసి పంజాబ్‌ కింగ్స్‌ను మట్టికరిపించిది. సొంతగడ్డపై ఉప్పల్​ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్​​తో జరిగిన మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్​​ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లెగ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే (4/15) స్పిన్‌ మాయాజాలం, రాహుల్‌ త్రిపాఠి (74 నాటౌట్‌; 48 బంతుల్లో 10×4, 3×6) ధానధన్​ ఇన్నింగ్స్‌ వల్ల సన్‌రైజర్స్‌కు తొలి విజయం దక్కింది. శిఖర్‌ ధావన్‌ (99 నాటౌట్‌; 66 బంతుల్లో 12×4, 5×6) విరోచిత పోరాటం చేసినా వృథా అయింది.

మొదట టాస్​ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లనష్టానికి 143 పరుగులు చేసింది. మార్కండేకు తోడు ఉమ్రాన్‌ మాలిక్‌ (2/32), మార్కో జాన్సెన్‌ (2/16) పంజాబ్​ను బాగా కట్టిడి చేశారు. వరుసగా వికెట్లను పడగొట్టారు. దీంతో పంజాబ్​ 90 స్కోరు కూడా చేయడం కష్టమనుకున్నారు. కానీ కెప్టెన్​ శిఖర్​ ధావన్(99*; 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) మాత్రం మ్యాచ్​ ప్రారంభం నుంచి నిలకడగా ఆడుతూనే ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. కానీ ఒక్క పరుగు తేడాతో శతకం మిస్ చేసుకున్నాడు. సన్​రైజర్స్​ భువనేశ్వర్ కూడా​ ఒక వికెట్​ పడగొట్టాడు.

ఇక 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్​రైజర్స్​ బ్యాటర్లు.. బౌలర్లు ఇచ్చిన స్ఫూర్తితో.. గత మ్యాచ్‌లకు భిన్నంగా బ్యాటింగ్​లో చెలరేగిపోయారు. ముఖ్యంగా రాహుల్‌ త్రిపాఠి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట.. సన్‌రైజర్స్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు హ్యారీ బ్రూక్‌ (13; 14 బంతుల్లో 3×4) ప్రారంభంలోనే ఔట్​ అయ్యాడు. అలా అతడు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఫెయిల్ అయ్యాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (21; 20 బంతుల్లో 3×4) కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. అప్పటికీ జట్టు స్కోరు 8.3 ఓవర్లలో 45/2. ఇక అప్పుడు త్రిపాఠి రంగంలోకి దిగి తన బ్యాటుకు పనిచెప్పాడు. మర్‌క్రమ్‌ (37*; 21 బంతుల్లో 6×4) నుంచి మంచి సహకారం లభించడం వల్ల త్రిపాఠి చెలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో స్డేడియాన్ని హోరెత్తించాడు. చివరికి హర్‌ప్రీత్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది త్రిపాఠి సన్‌రైజర్స్‌కు విజయం దక్కేలా చేశాడు. అలా త్రిపాఠి-మర్​క్రమ్​ కలిసి పంజాబ్​ హ్యాట్రిక్​ విజయాన్ని అందుకోకుండా చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 10, 2023, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.