ETV Bharat / sports

విజృంభించిన సన్​రైజర్స్​ బౌలర్లు.. ధావన్​ సెంచరీ జస్ట్​ మిస్​.. పంజాబ్ స్కోర్ ఎంతంటే? - ఐపీఎల్ 2023

IPL 2023 : ఐపీఎల్​ 16 సీజన్​లో భాగంగా హోమ్​ టీమ్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​, పంజాబ్​ కింగ్స్​ మధ్య​ జరుగుతున్న మ్యాచ్​లో పంజాబ్​​ ఇన్నింగ్స్​ పూర్తైంది. సన్​రైజర్స్​ బౌలర్లు విజృంభించారు. పంజాబ్​ జట్టు ఎంత కొట్టిందంటే?

IPL 2023  Sunrisers Hyderabad vs Punjab Kings MATCH

author img

By

Published : Apr 9, 2023, 9:25 PM IST

Updated : Apr 9, 2023, 10:09 PM IST

IPL 2023 : ఐపీఎల్​ 16 సీజన్​లో భాగంగా హోమ్​ టీమ్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​, పంజాబ్​ కింగ్స్​ మధ్య​ ఉప్పల్​ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్​లో పంజాబ్​​ ఇన్నింగ్స్​ పూర్తైంది. సన్​రైజర్స్​ బౌలర్లు విజృంభించారు. దీంతో పంజాబ్​ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. శిఖర్​ ధావన్(99*; 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. ఒక్క పరుగు తేడాతో శతకం మిస్ చేసుకున్నాడు. సామ్‌ కరన్‌ ​(22) ఫర్వాలేదనిపించగా.. మిగతా ప్లేయర్లందరూ పేలవ ప్రదర్శన చేశారు. హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి 88 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది పంజాబ్‌. శిఖర్​ ధావన్‌ కెప్టెన్​ ఇన్నింగ్స్​ ఆడి జట్టును ఆదుకున్నాడు. గౌరవప్రదమైన స్కోరు అందించాడు. బౌలింగ్​ విషయానికొస్తే.. మయాంక్​ మార్కండే చెలరేగి.. 4 వికెట్లు పడగొట్టాడు. జాన్​సెన్, ఉమ్రాన్​ మాలిక్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్​ ఒక వికెట్​ తీశాడు.

4-15-4.. మార్కండే​ మాయాజాలం..
సన్​రైజర్స్​ హైదరాబాద్​ బౌలర్ మయాంక్​ మార్కండే అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లు సంధించి.. నాలుగు వికెట్లు తీశాడు. అంతే కాకుండా కేవలం 15 మాత్రమే ఇచ్చాడు. మొదట పేసర్​ అయిన ఈ యువ బౌలర్.. తన కోచ్​ ప్రోత్సాహంతో లెగ్​ స్పిన్నర్​గా మారాడు. 2018లో ముంబయి ఇండియన్స్​ దరఫున దేశీయ క్రికెట్​లో అడుగుపెట్టాడు. దిగ్గజ క్రికెటర్​ ఎమ్​ఎస్​ ధోనీ వికెట్​ తీశాడు. అదే మార్కండేకు మొదటి వికెట్​. ఆ తర్వాత దిల్లీ, రాజస్థాన్​ జట్లకు ఆడాడు. ప్రస్తుతం సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టులో కొనసాగుతున్నాడు.

హైదరాబాద్‌ జట్టు : మయాంక్‌ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐదెన్ మార్‌క్రమ్‌ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్‌ క్లాసెన్ ( వికెట్ కీపర్), వాషింగ్టన్‌ సుందర్, భువనేశ్వర్‌ కుమార్, నటరాజన్, ఉమ్రాన్‌ మాలిక్, మార్కో జాన్​సెన్, మయాంక్​ మార్కండే

పంజాబ్​ జట్టు : శిఖర్​ ధావన్​(కెప్టెన్), ప్రభ్​సిమ్రన్​ సింగ్, మాత్యూ, జితేశ్​(వికెట్​ కీపర్), షారుక్​ ఖాన్, సామ్​ కుర్రన్, నాథన్ ఎల్లిస్, మోహిత్​ రాథీ, హర్​ప్రీత్​ బ్రార్​, రాహుల్​ చాహర్, అర్షదీప్​ సింగ్

పిచ్‌ రిపోర్ట్‌..
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరిగుతున్న ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఐపీఎల్‌ చరిత్రలో సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్‌ 20 సార్లు తలపడగా.. హైదరాబాద్‌ 13 మ్యాచుల్లో గెలిచింది. మరో ఏడు మ్యాచుల్లో పంజాబ్ విజయం సాధించింది.

Last Updated : Apr 9, 2023, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.