ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. హెన్రిచ్ క్లాసెన్(51 బంతుల్లో 104; 8x4, 6x6) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లో ఐదు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (27* 2x4,1x6) పర్వాలేదనిపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో వేన్ పార్నెల్ (2/13), షాభాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఓపెనింగ్ జోడీని మార్చింది. అభిషేక్ శర్మకు తోడుగా రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్‌కు దిగాడు.అయితే కాస్త దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ(14 బంతుల్లో 11; 2x4), రాహుల్ త్రిపాఠి(12 బంతుల్లో 15; 2x4, 1x6) వరుసగా నాలుగో ఓవర్లో వెంటవెంటనే పెవిలియన్ చేరారు. వీరిద్దరిని బ్రేస్వెల్నే పెవిలియన్ పంపాడు. 4.1ఓవర్‌కు అభిషేక్.. లామ్రర్రు క్యాచ్ ఇచ్చి ఔట్ అవ్వగా.. 4.3 ఓవర్‌కు హర్షల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు రాహుల్. ఇక వన్ డౌన్లో వచ్చిన కెప్టెన్ మార్క్రమ్(20 బంతుల్లో 18)తో కలిసిన హెన్రిచ్ క్లాసెన్ విజృంభించాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 76 పరుగులు నమోదు చేస్తే.. ఇందులో మార్క్రమ్ కేవలం 17 పరుగులే చేశాడు. 12.5 ఓవర్ వద్ద షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ దూకుడుకు 18.5 ఓవర్ వద్ద హర్షల్ పటేల్ కళ్లెం వేశాడు. చివర్లో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ నాలుగు బంతులు ఆడి ఓ ఫోర్ సాయంతో కేవలం ఐదు పరుగులే చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో పార్నెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మార్క్రమ్ వెళ్లిన తర్వాత క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ మాత్రం నిలకడగా ఆడుతూ చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు.
తొలి సెంచరీ.. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున స్థిరంగా బ్యాటింగ్ చేస్తున్న ఒకే ఒక్కడు హెన్రిచ్ క్లాసెన్ అని చెప్పాలి. అతడు ఈ మ్యాచ్‌లో సెంచరీ ఫీట్ నమోదు చేశాడు. 49 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అయితే క్లాసెన్‌కు ఐపీఎల్‌లో ఇదే ఫస్ట్ సెంచరీ. ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఫస్ట్ సెంచరీ హ్యారీ బ్రూక్ అందించగా.. రెండోది ఇప్పుడు క్లాసిన్ అందించాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇది ఆరో శతకం. అంతకుముందు ఈ సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్(కోల్‌కతా), యశస్వి జైశ్వాల్(రాజస్థాన్ రాయల్స్), హ్యారీ బ్రూక్(సన్‌రైజర్స్), సూర్యకుమార్ యాదవ్(ముంబయి ఇండియన్స్), ప్రభ్‌సిమ్రన్ సింగ్(పంజాబ్ కింగ్స్) శతకాలు బాదారు.
-
Did You Watch ?
— IndianPremierLeague (@IPL) May 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A maximum to bring up the 💯
Heinrich Klaasen scored a brilliant 104 off 51 deliveries.
Live - https://t.co/stBkLWLmJS #TATAIPL #SRHvRCB #IPL2023 pic.twitter.com/B6t2C4jfy1
">Did You Watch ?
— IndianPremierLeague (@IPL) May 18, 2023
A maximum to bring up the 💯
Heinrich Klaasen scored a brilliant 104 off 51 deliveries.
Live - https://t.co/stBkLWLmJS #TATAIPL #SRHvRCB #IPL2023 pic.twitter.com/B6t2C4jfy1Did You Watch ?
— IndianPremierLeague (@IPL) May 18, 2023
A maximum to bring up the 💯
Heinrich Klaasen scored a brilliant 104 off 51 deliveries.
Live - https://t.co/stBkLWLmJS #TATAIPL #SRHvRCB #IPL2023 pic.twitter.com/B6t2C4jfy1
ఇదీ చూడండి : ఐపీఎల్‌లో తెలుగుదనం.. మైక్ పట్టిన బ్యూటిఫుల్ లేడీ క్రికెటర్