ETV Bharat / sports

SRH Vs KKR MATCH : గెలవాల్సిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ ఓటమి.. చేజేతులా..

ఆరు బంతుల్లో 9 పరుగులు అవసరం. క్రీజులో అబ్దుల్‌ సమద్‌.. చేతిలో 3 వికెట్లు. ఇదంతా చూస్తుంటే ఇక సన్‌రైజర్స్‌ విజయం ఖాయమే అని అందరికి అనిపించింది. కానీ ఆఖరి ఓవర్లో సన్‌రైజర్స్‌ చేసింది 3 పరుగులే. దీంతో అనూహ్యంగా ఓటమిపాలయ్యింది సన్​రైజర్స్​ టీమ్​.గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుని ఈ సీజన్లో ఆరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.

SRH VS KKR MATCH
SRH VS KKR MATCH
author img

By

Published : May 4, 2023, 11:02 PM IST

Updated : May 5, 2023, 6:34 AM IST

సొంతగడ్డపై జరిగిన మ్యాచ్​లో సన్‌రైజర్స్‌ మరోసారి ఓటమిని చవి చూసింది. ఉప్పల్​ వేదికగా కేకేఆర్​తో జరిగిన మ్యాచ్‌లో ఎక్కువ శాతం ఆధిపత్యం కనబరిచనట్లే అనిపించినప్పటికీ ఆఖర్లో చేతులెత్తేసింది. దీంతో సన్​రైజర్స్​.. 5 పరుగుల తేడాతో కోల్‌కతా చేతిలో ఓడింది. మొదట కోల్‌కతా 9 వికెట్లకు 171 పరుగులనే సాధించగలిగింది. రింకు సింగ్‌, నితీశ్‌ రాణా రాణించారు. నటరాజన్‌, మార్కో జాన్సన్‌ ఆ జట్టును కట్టడి చేశారు. ఆ తర్వాత దిగిన సన్‌రైజర్స్‌ 8 వికెట్లకు 166 పరుగులే స్కోర్​ చేసింది. కెప్టెన్‌ మార్‌క్రమ్‌, క్లాసెన్‌ , అబ్దుల్‌ సమద్‌ పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్‌ అరోరా, శార్దూల్‌ ఠాకూర్‌, వరుణ్‌ చక్రవర్తి మెరిశారు. కాగా ఈ గెలుపుతో కోల్‌కతా తన ప్లేఆఫ్స్‌ అవకాశాల్ని సజీవంగానే ఉంచుకుంది.

ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. మయాంక్‌ అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టినప్పటికీ.. హర్షిత్‌ రాణా బౌన్సర్‌తో అగర్వాల్‌ను బోల్తాకొట్టించాడు. తర్వాతి ఓవర్లో వచ్చిన అభిషేక్‌ను సైతం శార్దూల్‌ ఠాకూర్‌ వెనక్కి పంపాడు. నటరాజన్‌ స్థానంలో ఇంపాక్ట్‌ ఆటగాడిగా వచ్చిన రాహల్‌ త్రిపాఠి.. రసెల్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు. రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌తో చెలరేగాడు. అదే జోరులో మరో స్కూప్‌ షాట్‌కు ప్రయత్నించే సమయంలో ఫైన్‌లెగ్‌లో వైభవ్‌ అరోరా చేతికి చిక్కాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్‌ 53/3 స్కోరుతో నిలిచింది.

సన్​రైజర్స్ టాప్​ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ మరోసారి నిరాశపరిచాడు. అప్పటికి జట్టు స్కోరు 54/4. ఈ స్థితిలో మార్‌క్రమ్‌, క్లాసెన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అలా 10 ఓవర్లలో 75/4 స్కోర్​తో సన్‌రైజర్స్‌ వేగం పుంజుకుంది. ఇక ఆ తర్వాత నిలకడగా ఉన్న ఈ ఇద్దరూ భారీ షాట్లకు దిగి జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. అనుకుల్‌ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లతో క్లాసెన్‌ చెలరేగిపోయాడు. వరుణ్‌ చక్రవర్తి తర్వాతి ఓవర్లో మార్‌క్రమ్‌ రెండు బౌండరీలు బాదాడు. నాలుగు ఓవర్లలో వరుసగా 15, 12, 12, 10 పరుగులు రావడం వల్ల లక్ష్యం చాలా వరకు కరిగిపోయింది.

అయితే 36 బంతుల్లో 48 పరుగులు అవసరమవ్వడం వల్ల సన్‌రైజర్స్‌ విజయం తేలికే అనిపించింది. అయితే శార్దూల్‌.. క్లాసెన్‌ను ఔట్‌ చేసి కోల్‌కతాను పోటీలోకి తెచ్చాడు. కాసేపటికే మార్‌క్రమ్‌ కూడా ఓటమిని అంగీకరించతప్పలేదు. అప్పటికింకా 18 బంతుల్లో 26 పరుగులు కావాల్సి ఉంది. జాన్సన్‌ (1) కూడా నిలవకపోయినా.. సమద్‌ పోరాడి సన్‌రైజర్స్‌ ఆశలను సజీవంగా ఉంచగలిగాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. స్పిన్నర్‌ వరుణ్‌ బంతిని అందుకోవడం ఆశ్చర్యపరిచింది. తొలి 2 బంతులకు సింగిల్స్‌ వచ్చాయి. మూడో బంతికి సమద్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ దగ్గర అనుకుల్‌ చేతికి చిక్కాడు. 3 బంతుల్లో 7 పరుగులు.. ఒకే పరుగు రావడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు.

Last Updated : May 5, 2023, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.