ETV Bharat / sports

బ్రూక్ కోసం ఆ ప్లేయర్​ను వదిలేశారా?.. ఆరెంజ్​ టీమ్​పై ఫ్యాన్స్​ ఫైర్​!

author img

By

Published : May 8, 2023, 1:21 PM IST

Updated : May 8, 2023, 1:29 PM IST

ఆదివారం రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఆద్భుతమైన పోరాట పటిమతో సన్​రైజర్స్​... కొండత లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్ ఆటగాడు గ్లెన్​ ఫిలిప్స్ మెరుపు బ్యాటింగ్​ తోడు అవడంతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన ఫిలిప్స్​ ఇన్ని రోజులు ఎక్కడున్నాడుంటే...

glenn phillips
glenn phillips

IPL 2023 RR VS SRH : రాజస్థాన్​లోని సవాయ్​ మాన్​ సింగ్​ స్టేడియం వేదికగా అద్భుతాలు జరిగాయి. ఆదివారం జరిగిన మ్యాచ్​లో 215 పరుగుల భారీ లక్ష్య ఛేదన చేసిన సన్​రైజర్స్ జట్టు.. ఆఖరికి విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. అయితే ఎంతో ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్​లో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. మొదటి నుంచి సన్​రైజర్స్​ దూకుడుగా ఆడినప్పటికీ ఇంకా కావాల్సిన రన్ రేట్​ ఎక్కువైపోతుండటం వల్ల ఆ జట్టు​ గెలుపుపై ఎవరికీ ఆశలు లేవు. సరిగ్గా ఇదే సమాయనాకి బ్రూక్​ను పక్కన పెట్టిన ఆరెంజ్​ టీమ్​.. ఫిలిప్స్​ను బరిలోకి దింపింది. అలా 12 బంతుల్లో 41 రన్స్​ కావాల్సిన దశలో 26 ఏళ్ల గ్లెన్​ ఫిలిప్స్ క్రీజులోకి వచ్చాడు. రాజస్థాన్ పేసర్ కుల్దీప్​ను లక్ష్యంగా చేసుకున్న ఈ యంగ్​ ప్లేయర్​.. 19వ ఓవర్లో వరుసగా 6,6,6,4 బాది మ్యాచ్​ స్వరూపాన్నే మార్చేశాడు. అలా తన అద్భుత ప్రదర్శనతో హైదరాబాదీల గుండెల్లో నిలిచిపోయాడు. 'బంగారు హుండీని చిల్లర వేయడానికి వాడినట్లు'... ఇన్ని రోజులు ఇలాంటి ఫినిషర్​ని జట్టులో ఉంచుకుని బెంచ్​కే పరిమితం చేసినందుకు మేనేజ్​మెంట్​పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సన్​రైజర్స్​ ఫ్యాన్స్​.

ఇన్నాళ్లూ ఎక్కడున్నావ్​ ఫిలిప్స్​..
Glenn Phillips IPL : తన ధనాధన్​ ఇన్నింగ్స్​తో హైదరాబాద్​కు చారిత్రక విజయాన్ని అందిచిన ఫిలిప్స్​ను ఆకాశానికెత్తేస్తున్నారు సన్​రైజర్స్​ అభిమానులు. 'ఇన్నాళ్లూ ఎక్కడున్నావయ్యా'.. 'మొదటి నుంచే ఫిలిప్స్​ను తుది జట్టులోకి తీసుకుని ఉంటే హైదరాబాద్ ఇప్పటికి టాప్​ పొజిషన్​లో ఉండేది' అంటూ సోషల్​ మీడియాలో కామెంట్లు దంచేస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్​ సీజన్​లో సన్​రైజర్స్​ ఆట తీరు ఏమాత్రం బాగాలేదని ఫ్యాన్స్​ అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచే ఈ జట్టును పరాజయాలు పలకరిస్తున్నాయి.

అటు బ్యాటింగ్​, ఇటు బౌలింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తూ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాలకే పరిమితమైంది. 13 కోట్లు వెచ్చించి ఏరి కోరి ఎంచుకున్న బ్రూక్ కేవలం ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్​లో మురిపించాడు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకున్నా.. అతన్ని జట్టులో కొనసాగించారు. అయితే బ్రూక్​ కోసం ఇన్ని రోజులు ఫిలిప్స్​ను పక్కన పెట్టారు. మరోవైపు సన్​రైజర్స్​కు దాదాపు ప్లే ఆఫ్​ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి. మిగిలిన నాలుగు మ్యాచ్​ల్లో నెగ్గినా ఫ్లే ఆఫ్స్​ చేరటం కష్టమే అని అనిపిస్తోందని ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు.

మ్యాచ్​ జరిగిందిలా..
Glenn Phillips SRH :ఆదివారం రాజస్థాన్​తో జరిగన మ్యాచ్​లో సన్​రైజర్స్ చారిత్రక విక్టరీని నమోదు చేసింది. వాస్తవంగా మొదటి నుంచి దూకుడుగా ఆడినా ఇంకా కావాల్సిన రన్ రేట్​ ఎక్కువైపోతుండటం వల్ల రైజర్స్​ గెలుపుపై ఎవరికీ ఆశలు లేవు. జట్టులో నిలకడగా రాణించే ఆటగాళ్లు కరవై పోయారు. హిట్టర్లు క్లాసెన్, కెప్టెన్ మర్​క్రమ్​ కూడా పెవీలియన్ చేరారు. 12 బంతుల్లో 41 రన్స్​ కావాల్సిన దశలో... రాజస్థాన్ శిబిరంలో గెలుపుపై ధీమా... సన్​రైజర్స్​ డగౌట్​లో ఉన్న ఆటగాళ్ల మొహాల్లో మరో ఓటమి చవి చూడబోతున్నామన్న నిరాశ మాత్రమే ఉంది. అప్పుడు వచ్చాడు 26 ఏళ్ల న్యూజిలాండ్​ బ్యాటర్ గ్లెన్​ ఫిలిప్స్. క్రీజులో ఉంది కొద్ది నిమిషాలే అయినా.. ఆ కొద్ది సమయంలోనే మ్యాచ్​ ఫలితాన్ని మార్చేశాడు. రాజస్థాన్ పేసర్ కుల్దీప్​ను లక్ష్యంగా చేసుకుని 19 ఓవర్లో రెచ్చిపోయాడు. మూడు సిక్సర్లు సహా ఓ ఫోర్ రాబట్టి మ్యాచ్​ స్వరూపాన్నే మార్చేశాడు. ఆశల్లేని స్థితి నుంచి విజయం అంచుల దాకా తీసుకొచ్చి ఔట్​ అయ్యాడు.

RR VS SRH : ఆఖరి ఓవర్​లో హైదరాబాద్​ విజయానికి 17 పరుగులు కావాలి. క్రీజులో సమద్​, జాన్సన్​ ఉన్నారు. కేకేఆర్​తో మ్యాచ్​లో చివరి ఓవర్లో 9 పరుగులు కొట్టలేకపోయిన సమద్​.. 17 రన్స్​ ఏం చేస్తాడు లే.. అనుకున్నారంతా. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 2,6,2 తీశాడు. ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో విజయం మళ్లీ ఆర్​ఆర్​ వైపు మొగ్గు చూపింది. లాస్ట్​ బాల్​కు సమద్​ క్యాచ్​ ఔట్​ అయ్యాడు. రాజస్థాన్ డగౌట్​లో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా అంపైర్ నో బాల్ సిగ్నల్​ ఇవ్వడంతో సీన్ మారింది. సమద్ సిక్సర్ బాది హైదరాబాద్​ ఖాతాలో మరో విజయాన్ని చేర్చాడు.

Last Updated : May 8, 2023, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.